India Covid-19: దేశంలో లక్షా 30వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 30వేలు దాటింది.

Last Updated : Nov 16, 2020, 10:14 AM IST
India Covid-19: దేశంలో లక్షా 30వేలు దాటిన కరోనా మరణాలు

Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 30వేలు దాటింది. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండూ కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఆదివారం ( నవంబరు 15న ) దేశ వ్యాప్తంగా కొత్తగా.. 30, 548 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 435 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,45,127 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,30,070 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Sabarimala: నేటినుంచి దర్శనమివ్వనున్న అయ్యప్ప స్వామి 

అయితే నిన్న కరోనా నుంచి 43,851 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య దేశంలో 82,49,579 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 4,65,478 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.27 శాతం ఉండగా.. మరణాల రేటు 1.47 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. ఆదివారం దేశవ్యాప్తంగా 8,61,706 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 15వ తేదీ వరకు దేశంలో మొత్తం 12,56,98,525 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఎసీఎంఆర్ వెల్లడించింది. Also read: Soumitra Chatterjee: బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత

Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News