Salute Indian Army: భారత సైనికుల సేవలను ఎంత కీర్తించినా తక్కువే. వారి సేవలు నిరూపమైనవి. ప్రజలు, దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతారు. ప్రకృతి విపత్తుల సమయంలో వారి సేవలతో ఎంతో మంది ప్రజలకు పునర్జన్మ దక్కుతుంది. తాజాగా మంచు కొండల్లో చిక్కుకున్న నెలలు నిండిన గర్భిణిని ప్రాణాపాయం నుంచి రక్షించారు. వారు సాహసంతో పుట్టబోయే బిడ్డకు, తల్లికి పునర్జన్మ ప్రసాదించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Delhi High Court: భార్యలకు హెచ్చరిక.. మీ భర్త ఆదాయం ఎంత ఉన్నా సర్దుకోవాల్సిందే..
ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న విల్గామ్ ఆర్మీ శిబిరానికి చెందిన సైనికులు భారీ హిమపాతం మధ్య ఒక గర్భిణిని రక్షిత ప్రాంతానికి తరలించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో గర్భిణికి నొప్పులు రావడంతో ఆమెను భారీ మంచు కురుస్తున్న కారణంగా ఆస్పత్రికి తరలించడం కష్టమైంది. సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సేవలందించింది.
Also Read: Ayodhya Temple BBC: అయోధ్య ఆలయంపై బ్రిటన్ పార్లమెంట్‌లో లొల్లి లొల్లి.. తప్పుడు కథనాలపై ఆగ్రహం
చలికాలం కావడంతో అక్కడ దాదాపు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో భారీగా మంచు పేరుకుపోయింది. మంచు వలన ఆ మహిళను ఆస్పత్రికి తరలించడానికి సాధ్యం కాలేదు. 2 నుంచి 3 అడుగుల లోతున ఉన్న మంచులో నడుస్తూ 7 నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న విల్గం ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గర్భిణిని తరలించారు. ఆస్పత్రిలోని వైద్యులు సత్వరమే స్పందించి ఆమెకు వైద్య సేవలు అందించారు. సైనికుల సహాయంతో ఆ మహిళ పండింటి పాపకు జన్మనిచ్చింది. ఆపత్కాలంలో తనను ఆదుకున్న సైనికులకు ఆ మహిళ కృతజ్ఞతలు తెలిపింది. తనతో పాటు పుట్టబోయే బిడ్డను కాపాడడంతో వైద్యులు కూడా సైన్యాన్ని అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. సైనికుల సేవలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
#WATCH | Kupwara, J&K: Vilgam Army Camp on Saturday rescued a pregnant woman amid heavy snowfall from Khanbal to PHC Vilgam of North Kashmir’s Kupwara District.
(Video source: Indian Army) pic.twitter.com/uiYbwbLyZm
— ANI (@ANI) February 4, 2024
జమ్మూలో సైనికులు చేసిన పనిని ఆర్మీ అధికారులు కూడా అభినందించారు. సదా మీ సేవలో అంటూ కీర్తిస్తూ ఆర్మీ అధికారులు పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'సలామ్ సైనికా' అంటూ సెల్యూట్ చేస్తున్నారు. మీ సేవలకు ఎంత కొనియాడినా తక్కువే అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మీ సేవలు నిరూపమానమని కొనియాడుతున్నారు. ఇలాంటి సైనికుల కోసమే కేంద్రం బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసిందని గుర్తు చేస్తున్నారు. వారికి ఎన్ని నిధులు ఇచ్చినా తక్కువేనని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook