Railway Ticket: రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్ధం భారతీయ రైల్వే రిజర్వేషన్ టికెట్ బుకింగ్ విషయంలో కొన్ని మార్పులు చేసింది. టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్ రెండింటినీ మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం రైల్వై టికెట్ బుకింగ్ అంతా దాదాపుగా ఆన్‌లైన్‌లో నడుస్తోంది. అదే విధంగా క్యాన్సిలేషన్ కూడా.
అయితే కొంతమంది ఇంకా రైల్వే కౌంటర్లలో టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. అలా రైల్వే కౌంటర్లలో రిజర్వేషన్ చేయించుకున్న టికెట్లను క్యాన్సిల్ చేయాలంటే తప్పనిసరిగా రైల్వే స్టేషన్‌కే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ విషయంలో రైల్వే శాఖ వెసులుబాటు కల్పిస్తోంది. ఇక నుంచి రైల్వే కౌంటర్లలో టికెట్ కూడా ఆన్‌లైన్ విధానంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. కౌంటర్ టికెట్ ఆన్‌లైన్ విధానంలో ఎలా క్యాన్సిల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.
ముందుగా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇందులో మీకు టికెట్ క్యాన్సిల్ ఆప్షన్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కేన్సిల్ కౌంటర్ టికెట్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు సెక్యూరిటీ క్యాప్చా , పీఎన్ఆర్ నెంబర్, రైలు నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ వివరాలు మీ కౌంటర్ టికెట్‌పై ఉంటాయి. మీ మొబైల్ నెంబర్ వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. మీరు కౌంటర్ టికెట్ తీసుకునేటప్పుడు ఫామ్‌లో ఏ నెంబర్ ఇస్తారో అదే నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తరువాత స్క్రీన్‌పై కన్పించే బాక్స్‌లో పాసెంజర్ వివరాలు నిర్ధారించుకోవాలి. చివరిగా సబ్మిట్ క్లిక్ చేస్తే మీ కౌంటర్ టికెట్ రద్దయిపోతుంది.
మరి రిఫండ్ ఎలా
రిఫండ్ డబ్బులు పొందేందుకు మాత్రం సమపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. మీరు క్యాన్సిల్ చేసిన టికెట్‌ను ఆక్కడ ఇస్తే మీకు రావాల్సిన రిఫండ్ చేతికి ఇస్తారు. అయితే రైలు బయలుదేరడానికి 4 గంటల ముందే కౌంటర్ టికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అదే ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ కేన్సిల్ చేస్తే మాత్రం రైలు షెడ్యూల్ సమయానికి అరగంట ముందు టికెట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
Also read: Bank Jobs 2025: బ్యాంక్ ఆప్ మహారాష్ట్రలో ఉన్నత ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే 1.73 లక్షల జీతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి