Omicron Vaccine: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు చెక్ పెట్టేందుకు మరో మేకిన్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. ఫిబ్రవరిలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తృతి వేగవంతమైంది. డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) కట్టడి చేసేందుకు దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చెందుతోంది. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ ఇది. పూణేకు చెందిన జెనోవా బయో ఫార్మాస్యూటికల్స్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. త్వరలో అంటే ఫిబ్రవరి నెలలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.
ఇదొక మెసెంజర్ ఆర్ఎన్ఏ (mRNA). ఇండియాలో అభివృద్ది చేసిన తొలి ఎంఆర్ఎన్ఏ కోవిడ్ వ్యాక్సిన్. ఫేజ్-2, ఫేజ్-3 పరిశోధనల్ని ఇప్పటికే డీసీజీఐ ఆమోదించిందని జెనోవా ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ఈ వ్యాక్సిన్ పేరు HGC019 అని,ఫేజ్-1 పరిశోధనల్ని ఇప్పటికే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు సమర్పించినట్టు కంపెనీ వెల్లడించింది. కంపెనీకు సంబంధించిన ఫేజ్-2, ఫేజ్-3 డేటాను డీసీజీఐకు (DCGI) సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ పరిశీలించనుంది. ఫేజ్-1 పరిశోధనల్ని సమీక్షించిన నిపుణులు..ఈ వ్యాక్సిన్‌ను సురక్షితమైన ఇమ్యునోజెనిక్‌గా గుర్తించారు. ఈ వ్యాక్సిన్..న్యూక్లియక్ యాసిడ్ వ్యాక్సిన్ వర్గానికి చెందింది. ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు జెనోవా బయో ఫార్మాస్యూటికల్స్ తెలిపింది.
Also read: delhi jail covid: ఢిల్లీ జైళ్లలో కరోనా కలకలం...170కిపైగా కేసులు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి