PC Chacko: మరో సీనియర్ కాంగ్రెస్ నేత అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా పార్టీకి రాజీనామా చేయడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేరళ కాంగ్రెస్ పార్టీకు గట్టి షాక్ ఎదురైంది. పార్టీ సీనియర్ నేత పీసీ చాకో రాజీనామా వ్యవహారం ఆందోళన కల్గిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరికి వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో సీనియర్ నేతలు గళం విప్పుతున్నారు. నిరసన తెలుపుతున్నారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో పార్టీ సీనియర్ నేత పార్టీని వీడటం సంచలనమైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు (Kerala Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో పార్టీ సీనియర్ నేత పీసీ చాకో (Congress leader pc chacko) రాజీనామా వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కేరళ కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం లేదని..రెండు వర్గాలుగా చీలిపోయుందని విమర్శలు చేశారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని..వర్గ విబేధాలతో విసిగి బయటకు వచ్చేస్తున్నానని పీసీ చాకో చెప్పారు. కేరళలో రెండు వర్గాలున్నాయని..ఒకటి ఉమెన్ చాందీ (Oommen chandi) వర్గమైతే.. రెండోది పీసీసీ ఛీఫ్ రమేశ్ చెన్నితాల ( Ramesh chennithala)వర్గమని మండిపడ్డారు. కేరళలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా..నాయకులు మాత్రం వర్గాల్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇదే అంశంపై హైకమాండ్ ముందు మాట్లాడినా పట్టించుకోలేదన్నారు.
నేను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాను..రాజీనామా లేఖను తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)కి పంపాను..గత కొద్దిరోజులుగా ఈ నిర్ణయంపై కొంతమందితో చర్చించాను..అనేక రకాలుగా ఆలోచించాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీలో చేరుతున్నానన్న ప్రచారాన్ని ఖండించారు. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. మరోవైపు పీసీ చాకో వంటి సీనియర్ నేత పార్టీని వీడటం పార్టీకి ఇబ్బంది కల్గించే పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీలో చేరడం లేదని ఖండిస్తున్నా..పార్టీని వీడింది మాత్రం అందుకేనని మరి కొంతమంది భావిస్తున్నారు. పీసీ చాకో కేరళ కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా, ఎంపీగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
Also read: Tirath Singh Rawat: Uttarakhand నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్, సాయంత్రం ప్రమాణ స్వీకారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook