Know Who is Gen Bipin Rawat..Bipin Rawat Helicopter Crash Live Updates CDS Bipin Rawat Biography Birth Education Family Military Career: భారత త్రివిధ దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. తమిళనాడులోని కూనూరు వెల్లింగ్టన్ బేస్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో (CSD Bipin Rawat) పాటు, సిబ్బంది, కొందరు కుటుంబ సభ్యులు మొత్తం 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ (Madhulika Rawat) కూడా ఇందులో ఉన్నారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను కనుగొన్నారు. సహాయకచర్యలు వేగంగా సాగుతున్నాయి. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం (Willington Army Center) నుంచి బయల్దేరిన ఐఏఎఫ్ ఎంఐ-17వీ5 సిరీస్ (IAF Mi-17V5) హెలికాప్టర్.. కాసేపటికే కుప్పకూలింది.
#LIVE | An IAF Mi-17V5 helicopter carrying India's Chief of Defence Staff Gen #BipinRawat crashed in the Coonoor area#IndianArmy #CDCRawat https://t.co/wGXoZDaEJg
— WION (@WIONews) December 8, 2021
అయితే బిపిన్ రావత్ ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా (Chief of Defence Staff Bipin Rawat) వ్యవహరిస్తున్నారు. మనదేశానికి తొలి సీడీఎస్ ఆయనే. ప్రస్తుతం భారత్‌లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి బిపిన్ రావత్. లద్దాఖ్ సంక్షోభ సమయంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేశారు. అలాగే మూడు దళాలు బీజింగ్‌ను సమష్టిగా ఎదుర్కోనే వ్యూహాంలో కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ పోషించిన పాత్ర చాలా కీలకమైనది. బిపిన్ రావత్ ఫోర్‌స్టార్ జనరల్.
IAF chopper Mi-17V5 carrying India's Chief of Defence Staff Gen #BipinRawat has crashed in the Coonoor area of Tamil Nadu state. There were 13 others on board including Gen Rawat's family members and staff.
Aviation expert Satyendra Pandey shares more inputs#IndianArmy pic.twitter.com/7Mm4YmmTfv
— WION (@WIONews) December 8, 2021
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ (Chief of Defence Staff Bipin Rawat) .. భారత్ రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు మార్గదర్శిగా వ్యవహరించారు. మనదేశంలో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్‌గా ప్రభుత్వంతో ఏర్పాటు చేయించిన ఘనత.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌ది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే కంటే ముందుగానే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆర్మీ బాధ్యతలు చూసుకొన్నారు.
IAF chopper Mi-17V5 carrying India's Chief of Defence Staff Gen #BipinRawat has crashed in the Coonoor area of Tamil Nadu state. There were 13 others on board including Gen Rawat's family members and staff.@SaroyaHem tells you more#IndianArmy #HelicopterCrash pic.twitter.com/JUfMUtiTgM
— WION (@WIONews) December 8, 2021
IAF chopper Mi-17V5 carrying India's Chief of Defence Staff Gen #BipinRawat has crashed in the Coonoor area of Tamil Nadu state. There were 13 others on board including Gen Rawat's family members and staff.@sdhrthmp gets you more updates#IndianArmy #HelicopterCrash pic.twitter.com/LQXfNubA0G
— WION (@WIONews) December 8, 2021
IAF chopper Mi-17V5 carrying India's Chief of Defence Staff Gen #BipinRawat has crashed in the Coonoor area of Tamil Nadu state. There were 13 others on board including Gen Rawat's family members and staff.@sdhrthmp, Aviation expert Satyendra Pandey gives more perspective pic.twitter.com/uMKs8jWD4Y
— WION (@WIONews) December 8, 2021
Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Bipin Rawat, his staff and some family members were in the chopper.
(Pics Source: Locals involved in search and rescue operation) pic.twitter.com/miALr88sm1
— ANI (@ANI) December 8, 2021
ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) పౌరీలో రాజ్‌పుత్ కుటుంబంలో బిపిన్ రావత్ జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్. లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.సీడీఎస్ బిపిన్ రావత్ అత్యున్నత పదవికి నియమితులైన మొట్టమొదటి సిట్టింగ్ ఆర్మీ స్టాఫ్ కూడా. అలాగే ఈ నియామకం సమయంలో ఆయన పదవీ విరమణ వయస్సును కూడా 62 సంవత్సరాల నుంచి 65 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం.. ఆర్మీ నిబంధనలను సవరించింది. సీడీఎస్ సైన్యానికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వానికి సలహాదారుగా పని చేస్తూనే.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సేవలను ఏకీకృతం చేసే ప్రధాన లక్ష్యంతో పని చేశారు.
Also Read : Bipin Rawat Helicopter Crash: తమిళనాడులో కూలిన ఆర్మీ హెలీక్యాప్టర్, చాపర్‌లో Bipin Rawat
బిపిన్ రావత్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) పూర్వ విద్యార్థి. డిసెంబర్ 1978లో భారత సైన్యంలో జాయిన్ అయ్యాడు బిపిన్ రావత్. తన తండ్రి పని చేసిన 11 గూర్ఖా రైఫిల్స్‌లోని ఐదో బెటాలియన్‌లో తొలుత విధులు నిర్వహించారు. నార్తన్, ఈస్ట్రన్ కమాండ్‌లతో పాటు భారతదేశంలోని అత్యంత క్లిష్టమైన భూభాగాల్లో పని చేసిన అనుభవం బిపిన్ రావత్‌కు ఉంది.
తన నాలుగు దశాబ్దాల సర్వీసులో.. బిపిన్ రావత్ బ్రిగేడ్ కమాండర్‌గా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-C) సదరన్ కమాండ్‌గా, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్‌లో జనరల్ స్టాఫ్ ఆఫీసర్ గ్రేడ్ 2, కల్నల్ మిలిటరీ సెక్రటరీ, డిప్యూటీ మిలిటరీ సెక్రటరీగా పని చేశారు.
ఇక మిలిటరీ సెక్రటరీ బ్రాంచ్, జూనియర్ కమాండ్ వింగ్‌లో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్‌గా బిపిన్ రావత్ పని చేశారు. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లోనూ పని చేశారు. అలాగే డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మల్టినేషనల్ బ్రిగేడ్‌కు కూడా నాయకత్వం వహించారు బిపిన్ రావత్.
బిపిన్ రావత్ సేవకుగానూ.. పరమ విశిష్ట సేవా పతకం (Param Vishisht Seva Medal) , ఉత్తమ యుద్ధ సేవా పతకం, (Uttam Yudh Seva Medal) అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం, (Yudh Seva Medal) సేన పతకం తదితర పతకాలతో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది.
Also Read : Bipin Rawat Helicopter Crash: బిపిన్ రావత్ హెలీకాప్టర్ ఎంఐ 17 ప్రత్యేకత, సామర్ధ్యమేం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook