CM Yogi Adityanath serious on womens photos and videos case: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళకు భక్తులు కోట్లాదిగా తరలివస్తునే ఉన్నారు. జనవరి 13న ప్రారంభమైన ప్రయాగ్ రాజ్ కుంభమేళ ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కారు ప్రకటించింది. ఇంకా దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు పుణ్యస్నానాలకు కోసం క్యూలు కట్టారు.
ఇదిలా ఉండగా.. కుంభమేళకు వచ్చిన మహిళలు, యువతుల స్నానాలు చేస్తున్న ఫోటోలు, వీడియోలను ఆన్ లైన్ లో కొంత మంది కేటుగాళ్లు డబ్బుల కోసం పెట్టినట్లు ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారంగా మారింది. ఆధ్యాత్మిక ఉత్సవంలో ఇలాంటి ఘోరాలు ఏంటని చాలా మంది మహిళలు తీవ్ర ఆందోళనలు చెందారు. దీనిపై ప్రస్తుతం యోగి సర్కారు చాలా సీరియస్ అయ్యింది.
ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ పోలీసులు కేసును నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన అకౌంట్ లు ఉన్న వారి సమాచారం ఇవ్వాలని యూపీ పోలీసులు మెటా సంస్థలకు ప్రత్యేకంగా లెటర్ లు రాశారు. తొందరలోనే దీని వెనకాల ఉన్న కేటుగాళ్లు తాటతీస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే దాదాపు.. 56 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.
Read more: Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ గొప్ప మనసు.. ఖైదీలకు కూడా కుంభమేళ పుణ్య స్నానాలు.. వీడియో వైరల్..
మరో ఆరురోజులు మాత్రమే శివరాత్రి పర్వదినం షాహిస్నానాలకు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుంభమేళకు మరింత మంది పబ్లిక్ వస్తారని యూపీ ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు కుంభమేళ నీళ్లలో బ్యాక్టిరియా ఉందనడంలో నిజంలేదన్నారు. దీనిపై రాజకీయాలు చేయోద్దని అఖిలేష్ యాదవ్, మమతలను యోగి తనదైన స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. అదే విధంగా కుంభమేళ పొడిగింపు ఉండదని ఇప్పటికే ప్రయాగ్ రాజ్ కలెక్టర్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి