వివాదాస్పద వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్న కేంద్ర మంత్రి

తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్న కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్

Last Updated : Oct 14, 2019, 04:11 PM IST
వివాదాస్పద వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్న కేంద్ర మంత్రి

''మూడు సినిమాలకు ఒక్కరోజులోనే రూ. 120 కోట్ల ఆదాయం వచ్చిందంటే దేశంలో ఇంకా ఆర్థికమాంద్యం ఎక్కడుంది" అని వ్యాఖ్యానించి రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్.. చివరకి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. నేను ఆర్థికమాంద్యం గురించి మాట్లాడుతూ అలా అన్న మాట వాస్తవమే కానీ మీడియా మాత్రం ఈ ఒక విషయాన్ని మాత్రమే ఎత్తిచూపడంతో విమర్శలొచ్చాయి అని అన్నారు. అందుకే నా మాటను వెనక్కి తీసుకుంటున్నా అని స్పష్టంచేశారు.

Trending News