Ayodhya Ram Mandir News Live Updates: జై శ్రీ రామ్.. అయోధ్యలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ

Ayodhya Ram Mandir Inauguration Ceremony Live: అయోధ్య రామమందిరంలో నేడు శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. దాదాపు 500 ఏళ్లుగా కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టం మరికొన్ని గంటల్లోనే ప్రారంభంకానుంది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 22, 2024, 02:32 PM IST
Ayodhya Ram Mandir News Live Updates: జై శ్రీ రామ్.. అయోధ్యలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ
Live Blog

Ayodhya Ram Mandir Consecration Ceremony Live: యావత్ భారతదేశం వేచిచూస్తున్న సుదీర్ఘ స్వప్నం నేడు సహకారం కానుంది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరి ముస్తాబు అయింది. ఈ మహోత్తర ఘట్టం సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగియనుంది. రామమందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరామచంద్రుడు కొలువుదీరనున్నాడు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రధాని మోదీతోపాటు 7 వేల మందికి పైగా ప్రముఖులు, అతిథులు అయోధ్యకు చేరుకున్నారు. కోట్లాది మంది టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లలో వీక్షిస్తున్నారు. ఈ శుభ ముహూర్తాన దేశ విదేశాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టాపన లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

22 January, 2024

  • 14:31 PM

    Ayodhya Ram Mandir News Live Updates: అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం

     

  • 13:40 PM
  • 13:28 PM

    Ayodhya Ram Mandir News Live Updates: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు  పూర్తయింది. వేడుక ముగిసిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ సాధువులు, ఋషులందరితో సమావేశమయ్యారు. అయోధ్యలోని అతిపెద్ద దేవాలయమైన మణిరామ్ దాస్ కంటోన్మెంట్ అధిపతి, రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను మోదీ కలిశారు. ఆయనను చూసిన ప్రధాని మోదీ వెంటనే చేతులు జోడించి నమస్కరించి.. పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నారు.

  • 13:10 PM

    Ayodhya Ram Mandir News Live Updates: శ్రీరామ నామస్మరణతో అయోధ్య నగరం మార్మోగుతోంది. దేశవ్యాప్తంగా ఆలయాల్లో శ్రీరామ కీర్తనలు, ప్రత్యేక భజనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో శ్రీరామ శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు.

  • 12:30 PM

    Ayodhya Ram Mandir News Live Updates: అయోధ్య రాముడిపై హెలికాఫ్టర్‌తో పూల వర్షం

     

  • 12:17 PM

  • 12:09 PM

    Ayodhya Ram Mandir News Live Updates: ప్రాణ ప్రతిష్ట వేడుక నేపథ్యంలో చాలా రాష్ట్రాలు నేడు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా హాఫ్ డే సెలవు ప్రకటించింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లతో సహా దేశం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు.

  • 12:02 PM

  • 11:50 AM

    Ayodhya Ram Mandir Live Updates: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో గాయకుడు సోను నిగమ్ పాటపాడుతున్న దృశ్యం

     

  • 11:42 AM

    Ayodhya Ram Mandir News Live Updates: అయోధ్యలోని రామ మందిరంలో పవిత్రోత్సవాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో ఘనంగా 'గంగా మహా హారతి' నిర్వహించనున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయంలో ఉదయం నుండి వేదపఠనం జరుగుతోంది.

  • 11:07 AM

    Ayodhya Ram Mandir News Live Updates: 500 ఏళ్ల పోరాటం తరువాత రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఉద్వేగానికి లోనయ్యారు. ప్రపంచం ఈ రోజు కోసం ఎదురుచూస్తోందన్నారు. సంతోషం మాటల్లో చెప్పడం కష్టంగా ఉందన్నారు. 

  • 10:25 AM

    Ayodhya Ram Mandir News Live Updates: రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠకు ముందు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక భస్మ హారతి నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు.
     

  • 10:20 AM

    Ayodhya Ram Mandir News Live Updates: అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరంలో మరికాసేట్లో బాల రాముడిగా శ్రీరామ చంద్రుడు కొలువు తీరనున్నాడు. త్రేతా యుగంలో 14 యేళ్లు వనవాసం చేసిన రామయ్య.. ఈ కలియుగంలో తను పుట్టిన అయోధ్యలో కొలువు తీరడానికి ఐదు వందల యేళ్లు పట్టింది. మొత్తంగా సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రస్థానంలో కొన్ని కీలక ఘట్టాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
     

  • 10:16 AM

    Ayodhya Ram Mandir News Live Updates: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొనడం అరుదైన అవకాశంగా భావిస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను ఎంతగానో పూజించే హనుమంతుడే తనకు ఈ ఆహ్వానం పంపించినట్లు ఉందన్నారు. 

  • 09:45 AM

    Ayodhya Ram Mandir News Live Updates: గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రముఖులందరికీ శ్రీరాముడి దర్శనం కల్పిస్తారు. వేడుకకు ముందు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు నీరు, మట్టి, బంగారం, వెండి, రత్నాలు, బట్టలు, ఆభరణాలు, భారీ గంటలు, డప్పులు మొదలైనవి తీసుకువస్తున్నారు. 

  • 09:40 AM

    Ayodhya Ram Mandir News Live Updates: చారిత్రాత్మకమైన అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశంలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక, మత శాఖల ప్రతినిధులు హాజరవుతారు. వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా వేడుకకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

  • 09:26 AM

    Ayodhya Ram Mandir News Live Updates: రామ్ లలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దూరదర్శన్, డీడీ న్యూస్, జీ న్యూస్ సహా అన్ని ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. దూరదర్శన్ నుంచి అన్ని ఛానెళ్లకు లైవ్ లింక్ లభించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Trending News