Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలిస్తున్నారు. ఇలా వుండగా ఈ నెల 26న రానున్న మహాశివరాత్రితో ఈ మహా క్రతువు ఉత్సవం ముగియనుంది. మహా కుంభమేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు జరుగనున్నాయి. ఇవి వరుసగా భోగి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి రోజు జరుగనున్నాయి. 45రోజుల పాటు ఘనంగా జరిగిన మహాకుంభమేళాలో షాహీ స్నాన్‌లకు విశిష్టమైన స్థానం ఉంది. వీటినే అమృత స్నానాలని కూడా అంటారు. ఇప్పటికే 5 రాజస్నానాలు పూర్తయ్యాయి.
ఇక చివరిది ఆరవ రాజస్నానం మహాశివరాత్రి రోజున జరుగనుంది. ఇందుకు కొన్ని కోట్లమంది ప్రయాగరాజ్‌కు రానున్నారని అంచనా వేస్తున్నారు. కుంభ మేళా సమయంలో ఋషులు, సాధువులు, భక్తులు త్రివేణీ సంగమ ప్రాంతంలో ఆరో, చివరి రాజ స్నానం చేస్తారు.
హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివ భక్తులు ఈ పండుగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినం జరుపుకోనున్నాం. మహా శివరాత్రి పర్వదినం రోజు శివ భక్తులు పరమేశ్వరుని ఆరాధిస్తారు. యేడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందంటారు. ఇంతటి పరమ పవిత్రమైన మహా శివరాత్రి రోజు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో అమృత స్నానం చేయడం అరుదైన అవకాశం అంటున్నారు పండితులు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.