Eknath Shinde : మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల తర్వాత తిరిగి ఎన్నికైనా రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేయడం ఆనవాయితీ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏక్ నాథ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను రాజ్ భవన్ లోని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు అందజేసారు. మహారాష్ట్రలో 14వ అసెంబ్లీ గడువు నేటితో ముగయనుంది. ఈ నేపథ్యంలో షిండే రాజీనామా చేసారు. మరోవైపు కొత్తగా ముఖ్యమంత్రిని ఎన్నుకునే వరకు ఏక్ నాథ్ షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొనసాగనున్నారు.
ఈ రోజు మహారాష్ట్ర సీఎంపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహా యుతి (ఎన్టీయే) 288 స్థానాలకు గాను 234 స్థానాల్లో విజయ దుంధుబి మోగించింది. ఇందులో బీజేపీ పార్టీనే సింగిల్ గానే 132 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు శివసేన షిండే 57 స్థానాల్లో విజయం సాధిస్తే.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలిచింది.
మొత్తంగా మహారాష్ట్రలో గెలిచిన తర్వాత సీఎం పీఠంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బీజేపీ పెద్దలు మాత్రం చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి అనే ఫార్ములాను రెడీ చేసినట్టు సమాచారం. మొదటి రెండున్నరేళ్లు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉంటారని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఆ తర్వాతా రెండున్నరేళ్లు ఏక్ నాథ్ షిండే సీఎం అవుతారనేది ప్లాన్. బీజేపీ లేదా శివసేన ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న మిగిలిన ఇద్దరు డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నారు. అయితే దేవేంద్ర ఫడణవీస్ కోసం ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ రంగంలోకి దిగినట్టు సమాచారం. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన దేవేంద్ర ఫడణవీస్ కే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని కేంద్ర పెద్దలపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో మహా సీఎం ఎవరనే దానిపై స్పష్టత రానుంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter