NEET UG 2024 Counselling: నీట్ యూజీ 2024 వివాదాలు, పేపర్ లీకేజ్ వ్యవహారం ఓవైపు, సుప్రీంకోర్టులో విచారణ మరోవైపు కొనసాగుతోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్ కూడా గట్టిగా విన్పిస్తోంది. ఈ క్రమంలో నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియను తదుపరి ఆదేశాల వరకూ నిలిపివేశారు. జూలై 8న సుప్రీంకోర్టులో విచారణ అనంతరం తిరిగి నిర్ణయం తీసుకోనున్నారు.
నీట్ యూజీ 2024 పరీక్షలో జరిగిన అవకతవకల నేపధ్యంలో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. గ్రేస్ మార్కుల వ్యవహారంలో మొదలైన గందరగోళంతో వివాదం పెరిగి పెద్దదైంది. ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగుచూశాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో గ్రేస్ మార్కుల్ని తొలగించి 1563 మంది విద్యార్ధులకు రీ నీట్ నిర్వహించిన ఎన్టీఏ తాజాగా రివైజ్డ్ ఫలితాలు ప్రకటించింది. 813 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరుకాగా అందులో ఎవరికీ పుల్ మార్కులు రాలేదు. టాపర్స్ జాబితా 67 నుంచి 61కి తగ్గిపోయింది.
నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాలంటూ దాఖలైన పిటీషన్లపై కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సైతం పిటీషన్లు దాఖలు చేశాయి. నీట్ రద్దు చేయడం అంటే ఉత్తీర్ణులైన లక్షలాదిమంది విద్యార్ధుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని కోర్టుకు విన్నవించాయి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్ని సీబీఐ దర్యాప్తు చేస్తోందని కోర్టుకు ఉదహరించాయి. కొన్ని ప్రాంతాల్లో పేపర్ లీకేజ్ కారణంగా మొత్తం పరీక్షనే రద్దు చేయడం సరైంది కాదని కేంద్రం వాదించింది.
NEET UG 2024 పరీక్ష మొత్తం రద్దు చేయడం వల్ల నిజాయితీగా, కష్టపడి పరీక్ష రాసిన లక్షలాదిమంది విద్యార్ధులకు నష్టం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నీట్ యూజీ 2024 వివాదంపై దాఖలైన పలు పిటీషన్లపై సుప్రీంకోర్టు జూలై 8న తుది విచారణ ఉండనుంది. ఈ నేపధ్యంలో నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియను తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది స్పష్టత రావల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook