Fiber Gas Cylinders: ఫైబర్ గ్యాస్ సిలెండర్లు వచ్చేశాయి, ధర, బరువు రెండూ తక్కువే, ఎంతంటే

Fiber Gas Cylinders: సాంప్రదాయ ఐరన్ సిలెండర్లకు కాలం చెల్లినట్టే ఇక. ఆ స్థానంలో ఫైబర్ సిలెండర్లు వచ్చేశాయి. గ్యాస్ సిలెండర్ ప్రమాదాలు కూడా ఇక తగ్గుముఖం పట్టనున్నాయి. ఫైబర్ సిలెండర్ ధర ఎంత, ఇతర ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 29, 2023, 02:47 PM IST
Fiber Gas Cylinders: ఫైబర్ గ్యాస్ సిలెండర్లు వచ్చేశాయి, ధర, బరువు రెండూ తక్కువే, ఎంతంటే

Fiber Gas Cylinders: మారుమూల పల్లెలో సైతం ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండేది గ్యాస్ సిలెండర్. గ్యాస్ సిలెండర్ లేకపోతే ఇంట్లో వంట ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఇంకా అదే పాతకాలం నాటి ఐరన్ గ్యాస్ సిలెండర్లతో అటు ఇబ్బందులు, ఇటు ప్రమాదాలు తలెత్తుతున్న పరిస్థితి. ప్రమాదాలకు చెక్ చెప్పేందుకే ఫైబర్ గ్యాస్ సిలెండర్లు వస్తున్నాయి. 

ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఇనుము గ్యాస్ సిలెండర్లు పాతబడే కొద్దీ తుప్పు పట్టి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి దాదాపుగా 30 కిలోల బరువుంటాయి. ఇందులో గ్యాస్ బరువు 14.2 కిలోలు కాగా మిగిలిందంతా సిలెండర్ బరువే. అంటే గ్యాస్ బరువు కంటే సిలెండర్ బరువే ఎక్కువ. ప్రమాదం జరిగినప్పుడు ఇనుప సిలెండర్ కావడంతో ప్రమాద తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తుప్పు పట్టిన సిలెండర్లతో అయితే ఇంటి ఫ్లోరింగ్ అంతా మరకలతో నిండిపోతుంటుంది. గ్యాస్ డెలివరీ సిబ్బందికి కూడా అంత బరువైన సిలెండర్లు మోయడంలో ఇబ్బంది పడుతుంటారు. 

అందుకే ఈ ఐరన్ సిలెండర్లకు ప్రత్యామ్నాయంగా కొత్తగా ఫైబర్ సిలెండర్లను ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లో వచ్చి చేరుతున్నాయి. పాత ఐరన్ సిలెండర్లతో పోలిస్తే ఫైబర్ సిలెండర్ల వల్ల ఎక్కువ ప్రయోజనాలున్నాయి. పాత సిలెండర్‌తో పోలిస్తే ఈ సిలెండర్ బరువు సగానికి సగం తక్కువ. గ్యాస్‌తో కలిపి ఫైబర్ సిలెండర్ బరువు 15.9 కిలోలు ఉంటుంది. ఇందులో గ్యాస్ 10 కిలోలు ఉంటుంది. ధర 810 రూపాయలు. ఫైబర్ గ్యాస్ సిలెండర్లలో 2 కిలోలు, 5 కిలోల సిలెండర్లు కూడా ఉంటాయి. సాంప్రదాయ మెటల్ సిలెండర్‌ను ఇచ్చి ఫైబర్ సిలెండర్ మార్చుకోవచ్చు. కాంపోజిట్ లేదా ఫైబర్ సిలెండర్ కావాలంటే 3600 చెల్లించాలి. మార్చుకోవాలనుకుంటే పాత డిపాజిట్ మినహాయించి మరో 1400 చెల్లించాల్సి ఉంటుంది. 

ఫైబర్ గ్యాస్ సిలెండర్ వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం ఉంది. సిలెండర్‌లో గ్యాస్ ఇంకా ఎంత ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఫైబర్ సిలెండర్ పారదర్శకంగా ఉండటంతో గ్యాస్ ఇంకా ఎంత ఉందనేది సులభంగా తెలుసుకోవచ్చు. మెటాలిక్ సిలెండర్‌లానే ఫైబర్ సిలెండర్ చాలా పటిష్టంగా ఉంటుంది. సెక్యూరిటీపరంగా ఇవే మంచివంటున్నారు. 

Also read: Bank Holidays: నవంబర్‌లో ఏకంగా సగం రోజులు బ్యాంకులకు సెలవులు, ఎప్పుడెప్పుడు, ఎక్కడ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News