India Finance minister Nirmala Sitharaman admitted to AIIMS Today: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం (డిసెంబర్ 26) మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఢిల్లీలోని ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం తెలుస్తోంది. ఓ ప్రైవేటు వార్డులో సీతారామన్‌కు చేర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
63 ఏళ్ల నిర్మలా సీతారామన్ ఆదివారం బాగానే ఉన్నారు. భారత మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి (డిసెంబర్ 25) సందర్భంగా నివాళులు అర్పించారు. మరుసటి రోజే (డిసెంబర్ 26) సీతారామన్ అనారోగ్యానికి గురయ్యారు. సీతారామన్‌ను ఎయిమ్స్ హాస్పిటల్‌లోని ప్రైవేటు వార్డులో అడ్మిట్ చేశారు. నిర్మలకు సంబంధించిన చికిత్సపై మరింత సమాచారం రావాల్సి ఉంది. సీతారామన్ సాధారణ చెకప్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
Union Finance Minister Nirmala Sitharaman admitted to AIIMS Delhi for a routine check-up: Official sources
(file photo) pic.twitter.com/8Lsa809rpx
— ANI (@ANI) December 26, 2022
Also Read: Bike Discount: ఈ బైక్‌పై ఏకంగా రూ. 1.25 లక్షల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే!
Also Read: Mars Tarnsit 2023: జనవరి 13న కుజ ప్రత్యక్ష సంచారం.. ఈ 5 రాశుల వారికి అఖండ ఐశ్వర్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.