ఒడిశా సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉషా దేవి హ్యాండ్ బ్యాగ్‌ను పూరి-దుర్గ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో కొందరు దొంగలు అపహరించారు. ఈ విషయమై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. భువనేశ్వర్‌లో రైలెక్కిన ఆమె అంగుల్ స్టేషనుకి సమీపంలో తన బ్యాగ్ పోయినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన టిట్లాఘర్ గవర్నమెంట్ రైల్వే పోలీసు అధికారులు కేసును నమోదు చేసిన దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. ఇదే విషయంపై మంత్రి మాట్లాడుతూ "ఒక రాష్ట్ర మంత్రికే భద్రత లేకపోతే.. ప్రజల పరిస్థితి ఏమిటి" అని వాపోయారు. మంత్రి ఉషాదేవి హ్యాండ్ బ్యాగులో 25 వేల రూపాయల నగదు, మొబైల్ ఫోన్, ఐడి కార్డుతో పాటు పలు బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. ఆమె ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసు యంత్రాంగం ఎఫ్‌ఐఆర్ నమోదు చూసి దొంగలను గాలిస్తున్నట్లు ఎస్సై మోహన్ నాయక్ పేర్కొన్నారు.