Vaccination drive India: దేశంలో టీకా ప్రక్రియకు ఏడాది- ప్రధాని మోదీ ఏమన్నారంటే..

Vaccination drive India: దేశంలో టీకా ప్రక్రియ ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలకు, వైద్యులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 05:19 PM IST
  • దేశంలో ఏడాది దాటిన వ్యాక్సినేషన్ డ్రైవ్​
  • టీకా ప్రక్రియలో భాగమైన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
  • ఇప్పటి వరకు దేశీయంగా 156 కోట్లకుపైగా టీకా డోసుల పంపిణీ
Vaccination drive India: దేశంలో టీకా ప్రక్రియకు ఏడాది- ప్రధాని మోదీ ఏమన్నారంటే..

Vaccination drive India: దేశంలో కరోనా టీకా ప్రక్రియ ప్రారంభమై నేటితో (16 జనవరి 2022) ఏడాది ముగుస్తోంది. ఈ నేపథ్యంలో టీకా ప్రక్రియకోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఈ మేరకు వరుస (PM Modi thanked those involved in the vaccination process) ట్వీట్​లు చేశారు.

మోదీ ట్వీట్​లలో ఏముందంటే..

'వ్యాక్సినేషన్ డ్రైవ్​లో భాగస్వాములైన వారందరికీ ధన్యవాదాలు. కొవిడ్​ 19పై పోరాటంలో టీకా పంపిణీ కార్యక్రమం అత్యంత శక్తిని అందించింది. ఇది జీవితాలను కాపాడతంతో పాటు.. ఉపాధికీ భద్రత కల్పించాయి.' అని ప్రధాని మోదీ ఓ ట్వీట్​లో (PM Moid on Vaccination drive) పేర్కొన్నారు.

మరో ట్వీట్​లో.. 'మహమ్మారిపై పోరులో భారత్ ఎప్పుడు శాస్త్రీయ విధానాన్నే అనుసరిస్తుంది. పౌరులందరికి సరైన ఆరోగ్య సంరక్షణను అందించేందుకు ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్నాం.' అని తెలిపారు. 

'ప్రస్తుత సమయంలో వైద్యులు,ల నర్సులు, ఆఱోగ్య కార్యకర్తల పాత్ర అసాధారణమైనది. మూరుమూల ప్రాంతాల్లోని ప్రజలు టీకా తీసుకున్నప్పుడు లేదా ఆరోగ్య కార్యకర్తలు అక్కడ టీకాలు ఇచ్చిన సందర్భాలు చూస్తే మనసులు గర్వంతో నిండి పోతాయి.' అని ప్రధాని పేర్కొన్నరు.

దేశంలో వ్యాక్సినేషన్​ ఇలా..

2021 జనవరి 2న కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ల అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో కొవాగ్జిన్ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయగా.. కొవిషీల్డ్​ దేశీయంగా ఉత్పత్తి అవడం (Corona vaccines in India) విశేషం.

జనవరి 16న వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే టీకాలు అందించారు.

అలా 2021 ఫిబ్రవరి 19న కోటి డోసుల మైరురాయిని దాటింది టీకా ప్రక్రియ. 2021 ఆగస్టు 6న 50 కోట్ల మార్క్ దాటిన టీకా పంపిణీ రికార్డు.. రెండు నెలల తర్వాత అక్టోబర్​ 21న వంద కోట్లపైకి చేరింది.

ఇక 2022 జనవరి 7న 150 కోట్ల డోసుల టీకా పంపిణీ ఘనతను సాధించింది భారత్​.

జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వయసు పిల్లలకు టీకా ఇస్తుండటంతో పాటు.. జనవరి 10 నుంచి ప్రికాషన్​ డోసు కూడా ప్రారంభించింది ప్రభుత్వం.

దేశంలో ఇప్పటి వరకు  1,56,76,15,454 డోసుల టీకాలు (Total vaccination numbers in India) పంపిణీ చేశారు. కొవాగ్జిన్​, కొవిషీల్డ్​తో పాటు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​ టీకా దేశీయంగా వినియోగంలో (Corona vaccines available in India) ఉన్నాయి.

Also read: Covid 19 Cases in India: దేశంలో కొత్తగా 2.71 లక్షల కరోనా కేసులు...

Also read: Archana Gautam: నా బికినీ ఫోటోలు చూసి ఓటు వేయొద్దు.. నేను ఎందుకు రాజకీయాలలోకి వచ్చానంటే: ఎమ్మెల్యే అభ్యర్థి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News