PM Narendra Modi: దేశంలో కొత్త వైద్య విధానం అందుబాటులో వచ్చింది. కొత్తగా ప్రతి జిల్లాకు ఓ పీజీ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
రాజస్థాన్‌లో నిర్మించ తలపెట్టిన నాలుగు కొత్త వైద్య కళాశాలలకు ప్రదాని నరేంద్ర మోదీ(PM Narendra modi) వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కీలకమైన విషయాలు వెల్లడించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక పీజీ వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో వైద్య విద్య, ఆరోగ్య సేవల్ని అందించే విషయంలో అంతరం తగ్గుతోందని చెప్పారు. ఇప్పటికే కేంద్రం ఆయుర్వేదం, యోగాను ప్రోత్సహిస్తోందని తెలిపారు. దేశంలో సంప్రదాయ, ఆధునిక వైద్య మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాల్సిన అవసరముందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే నేషనల్ హెల్త్ పాలసీను కొత్తగా ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో గత ఆరేళ్లలో 170కు పైగా మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయని, కొత్తగా మరో వంద కళాశాలల ఏర్పాటు కొనసాగుతోందని మోదీ స్పష్టం చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీను కూడా మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. వైద్య వ్యవస్థను సమూలంగా మార్చేందుకు ఎంసీఐ స్థానంలో నేషనల్ మెడికల్ కమీషన్(National Medical Commission) ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఎయిమ్స్ లేదా మెడికల్ కళాశాలల్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలన్నారు. దేశంలో గతంలో 6 ఎయిమ్స్ కళాశాలలు మాత్రమే ఉండేవని..ఇప్పుడు 22 వరకూ ఉన్నాయన్నారు. 2014లో కేవలం 82 వేల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు ఉండేవని..ఇప్పుడా సంఖ్య 1.40 కోట్లకు చేరిందని తెలిపారు. నూతన విద్యావిధానంలో భారతీయ భాషల్లో సైతం వైద్యవిద్యను అభ్యసించే సౌకర్యముందన్నారు.
Also read: AP Government: ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా నోరి దత్రాత్రేయుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి