Modi America Tour: సెప్టెంబర్‌‌లోనే ప్రదాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన

Modi America Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికా పర్యటించనున్నారు. క్వాడ్ దేశాల నేతల తొలి ముఖాముఖి భేటీకు హాజరుకానున్నారు. ఇదే నెలలో పర్యటన జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 5, 2021, 03:51 PM IST
  • సెప్టెంబర్ నెలలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన
  • క్వాడ్ సమావేశాల్లో భాగంగా జో బిడెన్‌తో ముఖాముఖి భేటీలో పాల్గొననున్న మోదీ
  • చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఏర్పడిన క్వాడ్
Modi America Tour: సెప్టెంబర్‌‌లోనే ప్రదాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన

Modi America Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే అమెరికా పర్యటించనున్నారు. క్వాడ్ దేశాల నేతల తొలి ముఖాముఖి భేటీకు హాజరుకానున్నారు. ఇదే నెలలో పర్యటన జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

సెప్టెంబర్ నెలలో క్వాడ్ దేశాల (Quad Countries)నేతల ముఖాముఖి సమావేశం జరగనుంది. ఈ భేటీ ఎప్పుడు ఎక్కడ జరిగేది ఇంకా కొలిక్కి రాకపోయినా ఇదే నెలలో జరిగే అవకాశాలున్నాయి. ఈ పర్యటన నిమిత్తం భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా(Pm Narendra modi) పర్యటించనున్నారు. క్వాడ్ దేశాల నేతల ముఖాముఖి భేటీ ఎక్కడనేది తెలిసిన వెంటనే ప్రధాని మోదీ పర్యటన ఖరారు కానుంది. ఈ నెల 22-27 మధ్య జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీను ఉద్దేశించి ప్రసంగం, క్వాడ్ సమావేశాల్లో పాల్గొనడం, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో(Joe Biden) సమావేశం ఉంటాయి.

వాస్తవానికి ఈ సమావేశం గురించి ఇప్పటికే నిర్ధిష్ట ప్రకటన రావల్సి ఉంది. అయితే పదవి నుంచి దిగిపోతానంటూ జపాన్ ప్రధాని సుగా చేసిన వ్యాఖ్యలతో సందిగ్దంలో పడింది. క్వాడ్ సమావేశంతో పాటు త్వరలో జరగాల్సిన ఇండో-జపాన్ సమావేశం కూడా ఖరారు కాలేదు. ఇప్పటికే రెండేళ్లుగా ఈ భేటీ వాయిదా పడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన(Pm Modi America Tour) ఖరారైతే చేయాల్సిన ఏర్పాట్లపై ఇండో అమెరికా అధికారులు చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ చెప్పే ఉద్దేశ్యంతో క్వాడ్ ఏర్పాటైంది. 

Also read: Nipah Virus: కేరళలో మరో కలకలం, నిఫా వైరస్ కారణంగా బాలుడి మృతి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News