Nose ring in women lungs: బాప్ రే.. మహిళ ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయిన ముక్కుపుడక.. అసలేం జరిగిందంటే..?

Nose ring in lungs: ఒక మహిళ పొరపాటున ముక్కుపుడుక పిన్ ను గట్టిగా పీల్చుకుంది. అది ముక్కు నుంచి ఆమె ఊపిరితిత్తులోకి వెళ్లిపోయింది. దీంతో కొన్నినెలలుగా ఆమె శ్వాసతీసుకొవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంంది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లో చోటుచేసుకుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 28, 2024, 09:39 AM IST
  • శ్వాస తీసుకొవడానికి ఇబ్బందులు పడుతున్న మహిళ..
  • ఎక్స్ రేలో బైగపడ్డ షాకింగ్ ఘటన..
Nose ring in women lungs: బాప్ రే.. మహిళ ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయిన ముక్కుపుడక.. అసలేం జరిగిందంటే..?

Doctor removes nose pin screw from woman's lungs in west bengal: కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. మనం తినేటప్పుడు ఏవైన పదార్థాలు గొంతులో ఇరుక్కుపోతేనే మనకు ప్రాణం పోయినట్లు అన్పిస్తుంది. అది క్లియర్ అయ్యే వరకు కూడా మనిషి ఏ పనులను కూడా చేసుకోలేడు. చిన్న పిల్లలు ఆడుకుంటూ కొన్ని ఆటవస్తువులు, ఏవైన పదార్థాలు మింగడం మనం చూస్తుంటాం కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో చిన్న  పిల్లలు తమ ప్రాణాలను పొగొట్టుకున్న ఘటనలు కొకొల్లలు. అయితే.. ఇక్కడోక మహిళ అత్యంత అరుదైన పరిస్థితిని ఎదుర్కొంది. వెస్ట్ బెంగాల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read More: Doctor left surgery: ఆకలేస్తోంది.. మసాల దోశ తినేసి వస్తా.. సర్జరీ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్..

పశ్చిమ బెంగాల్‌లోని ఒక మహిళ గాలిని గట్టిగా పీల్చడంతో ముక్కు రంద్రం ద్వారా ఆమె ముక్కులోకి ఊపిరితిత్తులోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె శ్వాసతీసుకొవడానికి ఇబ్బందులు పడుతుంది. నివేదికల ప్రకారం, ఆమె గత 17 సంవత్సరాలుగా ధరించిన ఆభరణాలలో కొంత భాగాన్ని పీల్చుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ఆమె..క్రమంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కొవడం  ప్రారంభించింది. వెంటనే 35 ఏళ్ల వర్షా  దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను టెస్టులు చేసిన వైద్యులు స్కాన్ చేశారు. స్కాన్ లో.. ఊపిరితిత్తుల్లోకి స్క్రూ చేరిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేసి ముక్కు పుడకను బైటకు తీశారు. దీంతో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పిపోయిందని అందరు ఊపిరిపీల్చుకుంటున్నారు.

దీనిపై.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నివాసి వర్ష  మాట్లాడుతూ, తన ముక్కు పుడకకు ఉనర్న స్క్రూ వదులుకుందని తాను అనుకోలేదని... శ్వాసతీసుకోవడం ఇబ్బంది వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్లినట్లుచెప్పింది. తొలుత.. అది నా కడుపులోకి వెళ్లిందని నేను అనుకున్నాట్లు ఆమె తెలిపింది. ప్రారంభంలో, లోహ వస్తువు సహజంగా తన జీర్ణవ్యవస్థ గుండా వెళుతుందని వర్ష భావించినట్లు తెలిపింది.కానీ..రెగ్యులర్ గా దగ్గులు,  శ్వాసలోపం ,  న్యుమోనియా వంటి సమస్యలతో బాదపడేది. డాక్టర్లు.. మొదట మందులు ఇచ్చారు. అయినా అయినప్పటికీ తగ్గకపోవడంతో..  CT స్కాన్,  ఛాతీ ఎక్స్-రే చేయించారు. అప్పుడు.. ఈ సమస్యకు ముక్కు పిన్ స్క్రూ కారణమని వైద్యులు గుర్తించారు. 

Read More: Pune man Quits Job: ఇలాంటి టాక్సిక్ మనుషుల మధ్య పనిచేయలేను.. వైరల్ గా మారిన పూణే యువకుడి లాస్ట్ వర్కింగ్ డే సెలబ్రేషన్స్..

పల్మోనాలజిస్ట్ వైద్యులు.. బాధితురాలి ఊపిరితిత్తుల నుండి వస్తువును తొలగించడానికి తొలుత ఫైబ్రోప్టిక్ బ్రోంకోస్కోప్‌ను ఉపయోగించారు. కానీ అది విఫలమైంది. ఆ తర్వాత ఆమెను మెడికా సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ దేబ్రాజ్ జాష్ వద్దకు రిఫర్ చేశారు. ఈక్రమంలో.. అక్కడి వైద్యులు టెస్టులు చేసి.. మెల్లగా బాధితురాలికి ఎక్స్ పర్ట్ డాక్టర్లు సర్జరీలు చేసి ముక్కుపుడకను బైటకు తీశారు.ఇది అత్యంత అరుదైన ఘటన అని.. ఆమెకు సర్జరీ చేసిన వైద్యులు.. డాక్టర్ జాష్ తెలిపారు. తాము ఎంతో కష్టపడి ఈ సర్జరీనీ సక్సెస్ చేసినట్లు తెలిపారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News