కరోనా వైరస్ ( Corona virus ) మరో ప్రముఖ వ్యక్తిని సోకింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Reserve bank of india ) గవర్నర్ శక్తికాంత దాస్ ( Governor Shaktikanta das ) కోవిడ్ 19 ( Covid 19 ) బారిన పడ్డారు. స్వయంగా ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా వైరస్ తీవ్రత ఇంకా తగ్గడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా వైరస్ సంక్రమణ ఇటీవలి కాలంలో మళ్లీ పెరుగుతోంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కు కరోనా వైరస్ సోకింది. స్వయంగా ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు గవర్నర్ శక్తికాంత దాస్.
అయితే తనకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు చెప్పారు.
I have tested COVID-19 positive. Asymptomatic.Feeling very much alright.Have alerted those who came in contact in recent days.Will continue to work from isolation. Work in RBI will go on normally. I am in touch with all Dy. Govs and other officers through VC and telephone.
— Shaktikanta Das (@DasShaktikanta) October 25, 2020
ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు అప్రమత్తంగా ఉండాలని శక్తికాంత దాస్ సూచించారు. స్వీయ నిర్బంధంలో ఉంటూనే తన కార్యకలాపాలు కొనసాగిస్తానన్నారు. ఆర్బీఐ ( RBI ) యథావిధిగా పనిచేస్తుందని చెప్పారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు, ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్, టెలిఫోన్ల ద్వారా అందుబాటులో ఉంటానన్నారు. Also read: CAA: మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఒవైసీ ఆగ్రహం