REET-2021: 'చెప్పు'లో బ్లూటూత్ అమర్చి... పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌‌...చివరకు..

Rajasthan: టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ఎంత ఉపయోగం ఉందో..అంతే అనర్ధం కూడా ఉంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కొందరు పలు అక్రమాలకు తెరలేపుతున్నారు. తాజాగా రాజస్థాన్ లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన అర్హత పరక్షలో కొందరు అభ్యర్థులు హైటెక్ కాఫీయింగ్ పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2021, 11:07 AM IST
  • రాజస్తాన్‌లో హైటెక్‌ కాపీయింగ్‌
  • స్లిప్పర్స్ లో బ్లూటూత్ సహాయంతో అక్రమాలు
  • ఐదుగురు అరెస్ట్
REET-2021: 'చెప్పు'లో బ్లూటూత్ అమర్చి... పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌‌...చివరకు..

REET-2021: రాజస్తాన్‌(Rajasthan)లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో కొందరు అభ్యర్థులు హైటెక్‌ కాపీయింగ్‌(Hi-tech Copying) కు పాల్పడ్డారు. ‘బ్లూటూత్‌ అమర్చిన చెప్పులు’ ధరించి ఈ అక్రమాలకు తెరలేపారు. ఈ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాజస్తాన్‌ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్‌ ఫర్‌ టీచర్స్‌((REET-2021)ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. తొలుత అజ్మీర్‌లోని ఓ కేంద్రంలో పరీక్ష రాసేటప్పుడు అనుమానాస్పదంగా వ్యవహరించిన ఓ అభ్యర్థిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడు ధరించిన చెప్పు(Slipper) లోపల కనిపించకుండా సెల్‌ఫోన్‌ను అమర్చినట్లు గుర్తించారు. అలాగే చెవిలో బయటకు కనిపించని బ్లూటూత్‌తో కూడిన సూక్ష్మమైన రిసీవర్‌ ఉంది. పరీక్ష కేంద్రం బయట ఉన్న వ్యక్తులు అతడికి సమాధానాలు చేరవేస్తున్నట్లు కనిపెట్టారు.

Also Read: Doctor removes patient's trousers: మహిళా పేషెంట్‌‌పై డాక్టర్ లైంగిక వేధింపులు

వాటిని సదరు అభ్యర్థి చెప్పులోని సెల్‌(Cell)కు అనుసంధానించిన బ్లూటూత్‌ రిసీవర్‌(Bluetooth Receiver) ద్వారా వింటున్నట్లు తేల్చారు. ఇందుకు గాను వారు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 6 లక్షల వంతున వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అధికారులు అన్ని ఎగ్జామ్‌ సెంటర్లను అప్రమత్తం చేశారు. బికనెర్, సికార్‌ పట్టణాల్లోనూ ఇలాంటి బాగోతాలే బయటపడ్డాయి. మూడు పట్టణాల్లో మొత్తం ఐదుగురు చీటర్లను అరెస్టు(Arrest) చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాఫీయింగ్ చెప్పులను చాలా తెలివిగా తయారు చేశారని, ఇది కుటీర పరిశ్రమను తలపిస్తోందని వెల్లడించారు. దీని వెనుక పెద్ద రాకెట్‌(Rocket) ఉన్నట్లు తెలుస్తోందన్నారు.

‘రీట్‌’ తదుపరి దశ పరీక్షకు అభ్యర్థులెవరూ స్లిప్పర్స్, బూట్లు, సాక్సులు ధరించి రావొద్దని అధికారులు ఆదేశించారు. ఆదివారం రీట్‌ సందర్భంగా అనేక ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ సేవలను 12 గంటలపాటు ఆపారు.  రాజస్థాన్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ 3,993 కేంద్రాల ద్వారా నిర్వహించిన ఈ పరీక్షలకు 16.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్నిచోట్ల అవతవకలు చోటు చేసుకున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News