Mohan Bhagwat: ముస్లింలు ఆధిపత్యభావజాలం వదులుకోవాలి, దుమారం రేపుతున్న వ్యాఖ్యలు

Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలు ఆధిపత్యం వదులుకోవాలని సూచించడం వివాదానికి దారితీస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 11, 2023, 11:21 AM IST
Mohan Bhagwat: ముస్లింలు ఆధిపత్యభావజాలం వదులుకోవాలి, దుమారం రేపుతున్న వ్యాఖ్యలు

దేశంలో ముస్లింలపై ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ముస్లింలపై దాడుల్ని ప్రోత్సహించడమేనని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ విమర్శించారు. ఆ వివరాలు మీ కోసం..

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి దేశంలోని ముస్లింలలో అభద్రతా భావం, భయం పెరిగిపోయిందనే విమర్శలు అధికమౌతున్నాయి. ఆర్ఎస్ఎస్ భావజాలమే ఇందుకు కారణమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ మరోసారి కీలకమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు మరోసారి దుమారం రేగుతుంది. 

మోహన్ భగవత్ వ్యాఖ్యలు

హిందూస్తాన్ హిందూస్తాన్‌గానే ఉంటుంది. ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఒకప్పుడు ముస్లింలు ఈ దేశాన్ని పాలించినందున మరోసారి పరిపాలిస్తామనే ఆధిపత్య భావజాలాన్ని వదులుకోవాలి. ఇక్కడ నివసించే హిందూవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు ఎవరైనా సరే ఈ భావజాలం వదులుకోవాలని మోహన్ భగవత్ సూచించారు.

ఈ వ్యాఖ్యలపై ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ మండిపడ్డారు. హిందూస్తాన్ హిందూస్తాన్‌లాగే ఉంటుందన్నప్పుడు మనుషులు మనుషుల్లానే ఉండాలిగా అంటూ మోహన్ భగవత్‌కు కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ ఓ వైపు అందర్నీ కలుపుకుని పోతామని చెబుతూనే..ముస్లింలపై దాడుల్ని ప్రోత్సహిస్తోందని కపిల్ సిబల్ ఆరోపించారు. 

Also read: Budget Facts: దేశపు తొలి బడ్జెట్ , అతి పెద్ద బడ్జెట్ ఎప్పుడు, బడ్జెట్ సంబంధించిన ఆసక్తికర అంశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News