మాజీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిరం అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే ఆత్మాహుతి దళాలు (బలిదానీ దాస్తా) బయటకి వస్తాయని హెచ్చరించారు. రామమందిరాన్ని నిర్మించకపోతే మందిర నిర్మాణం కోసం బలిదాన దళాలు తమ వంతు సాయం చేస్తాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు సంయమనంగా ఉంటామని కటియార్ అన్నారు. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనంత వరకు ఈ దళాలు బయటకి రావని, అయితే ీ దళాలు ఇప్పటికే పూర్వ కార్యాచరణ పనుల్లో ఉన్నాయని లక్నోలో ఆయన మీడియాకి తెలిపారు.
బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా ఉన్న ఇక్బాల్ అన్సారీకి ఈ వివాదంపై అవగాహన లేదని కటియార్ చెప్పారు. భజ్‌రంగ్‌దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడైన కటియార్ మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈయన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
తీర్పు వ్యతిరేకమైతే ఆత్మాహుతిదళాలు ప్రవేశం