SBI Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ (స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా - SBI) పలు శాఖల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఎస్బీఐకి చెందిన పలు శాఖల్లోని 6,160 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. సెప్టెంబరు 1 నుంచి ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. సెప్టెంబరు 21తో ఈ ప్రక్రియ ముగియనుంది.
అప్లికేషన్ గడువు దగ్గర పడుతుండటంతో ఇంకా అప్లై చేయని అభ్యర్ధులు వెంటనే అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లే చేసే వారు SBI అధికారిక వెబ్ సైట్.. sbi.co.in లోకి వెళ్లి అప్రెంటీస్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో ఈ పోస్టులకు ఆన్ లైన్ పరీక్షను నిర్వహిస్తారు.
అభ్యర్ధులకు అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అలాంటి వారు ఈ పోస్టులకు అర్హులు. 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తులు ఈ అప్రెంటీస్ అప్లై చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్ధులకు వయోపరిమితి సడలింపు ఇస్తారు.
దరఖాస్తు రుసుము..
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అభ్యర్ధులు రూ. 300 అప్లికేషన్ ఫీజు. మిగిలిన SC / ST / PwBD కేటగిరీల వారంతా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అన్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా?
> ముందుగా SBI అధికారిక వెబ్ సైట్ (sbi.co.in) లోకి వెళ్లాలి.
> అప్రెంటీస్ రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి.
> SBI అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023లో వివరాలను పూర్తిగా చదవండి.
> దరఖాస్తుకు సంబంధించిన మీ పూర్తి వివరాలను నమోదు చేయండి.
> అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించండి.
> అప్లికేషన్ ప్రక్రియని పూర్తి చేయండి.
> అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకొని భవిషత్తు అవసరాల కోసం దాచుకోండి.
Also Read: Chandrababu Case: హైకోరులో చంద్రబాబుకు నిరాశ, క్వాష్ పిటీషన్ విచారణ వారం వాయిదా
ఎంపిక ప్రక్రియ..
SBI అప్రెంటీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మొదటగా ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల పాటు జరిగే ఈ పరీక్షలో నాలుగు భాగాలు ఉంటాయి. అందులో జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వంటి ప్రతి విభాగానికి సంబంధించి 15 నిమిషాల కాల వ్యవధిని కేటాయిస్తారు. ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్కు చొప్పున ప్రతి విభాగానికి 25 ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2023
ఆన్‌లైన్ ఎగ్జామ్: అక్టోబర్ లేదా నవంబర్ 2023.
ఈ రిక్రూట్మెంట్ లో పాల్గొనే అభ్యర్ధులు నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook