కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. కొందరు కరోనాను జయిస్తుండగా, మరికొందరు కరోనాతో పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో పెను విషాదం నెలకొంది. ఇటీవల కరోనా బారిన పడిన ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి(34) కన్నుముూశారు.
తనయుడు ఆశిష్ ఏచూరి మరణవార్తను ట్వీట్ ద్వారా సీతారాం ఏచూరి వెల్లడించారు. ‘ఇది చాలా బాధాకరం. నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి(Ashish Yechury Passes Away) కరోనాతో పోరాడుతూ నేటి ఉదయం కన్నుమూశాడు. ఆశిష్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి, నర్సులు, ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు, మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ’ సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.
Also Read: Covisheild Vaccine Price: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
It is with great sadness that I have to inform that I lost my elder son, Ashish Yechury to COVID-19 this morning. I want to thank all those who gave us hope and who treated him - doctors, nurses, frontline health workers, sanitation workers and innumerable others who stood by us.
— Sitaram Yechury (@SitaramYechury) April 22, 2021
కాగా, ఆశిష్ ఏచూరి ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు రావడంతో కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. పరీక్షలలో ఆయనకు కోవిడ్19 పాజిటివ్‌గా తేలడంతో తొలుత హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో చేర్పించి ఆశిష్ ఏచూరికి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం ఉదయం సీతారాం ఏచూరి(Sitaram Yechury) పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి తుదిశ్వాడ విడిచాడు.
Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 22, 2021, ఓ రాశివారికి వాహనయోగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook