Supermoon 2022 Visible on July 13 at Mid Night: అంతరిక్షంలో మరో అద్భుతం చోటు చేసుకునేందుకు సమయం ఆసన్నమవుతోంది. 2022 జూన్ 14న స్ట్రాబెర్రీ మూన్ ఏర్పడగా.. 2022 జులై 13న సూపర్‌మూన్ సంభవించనుంది. బుధవారం రాత్రి 12.07 గంటలకు సూపర్‌మూన్‌ను మనం చూడవచ్చు. దీని అనంతరం వచ్చే ఏడాది జూలై 3న మళ్లీ కనిపిస్తుంది. గత నెల పౌర్ణమి రోజున చంద్రుడు 10 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా, పెద్దదిగా కనిపించాడు. అలాంటి సందర్భమే మరోసారి రేపు ఏర్పడబోతోంది.
బుధవారం భూకక్ష్యకు అత్యంత సమీపానికి చంద్రుడు రాబోతోతున్నాడు. దాంతో చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. సూపర్‌మూన్ రాత్రి చంద్రుడు రోజువారీ కంటే చాలా పెద్దగా, ప్రకాశవంతంగా మరియు గులాబీగా ఉంటాడు. సాధారణ పున్నమి రోజుల్లో కంటే చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం అధిక ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. దీనిని డీర్ మూన్, థండర్ మూన్, హే మూన్ మరియు విర్ట్ మూన్ అని కూడా అంటారు. అమెరికాలో సాల్మన్ మూన్, రాస్ప్బెర్రీ మూన్ అని పిలుస్తారు.
సూపర్‌మూన్ అనే పదం 1979లో అమలులోకి వచ్చింది. దీనిని జ్యోతిష్యుడు రిచర్డ్ నోయెల్ కనిపెట్టాడు. చంద్రుడు భూమి యొక్క పెరిజీలో (చంద్రుడు భూమి కక్ష్యకు అత్యంత సమీపానికి రావడాన్ని) 90% లోపల ఉన్నప్పుడు ఏర్ప[ఏర్పడే ఈ ఖగోళ సంఘటనను సూపర్‌మూన్ అంటారు. సూపర్‌మూన్ సంవత్సరానికి మూడు సార్లు జరిగే ఒక సాధారణ ఖగోళ సంఘటన. ఈ రోజు చంద్రునిలో కొన్ని ప్రత్యేక శక్తులు వస్తాయని ఏమి ఉండదు. ఈ రోజున భూమికి చంద్రుడు చాలా దగ్గరగా ఉన్నందున రోజువారీ కంటే పెద్దదిగా కనిపిస్తాడు.
సూపర్‌మూన్ సమయంలో భూమి, చంద్రుడికి మధ్య ఉండే దూరం 3,57,256 కిలోమీటర్లు. అందుకే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. దాంతో సముద్రంలోని అలలు సాధారణ స్థితి కంటే ఎక్కువగా పోటెత్తుతాయి. సముద్రం ముందుకు దూసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సూపర్‌మూన్ కారణంగా సముద్రంలో తుఫాను ఏర్పడి వరదలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: Mango Leaves Benefits: మామిడి ఆకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Also Read: Guru Purnima 2022: రేపు గురు పూర్ణిమ.. ఒకే రోజు 4 రాజ యోగాలు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook