2021 జూన్ 8వ తేదీన ఓ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలని గడువు విధించిన సుప్రీంకోర్టు బెంచ్..మానవీయ కోణం ఉండకూడదని ఆదేశించింది. కానీ అదే సుప్రీంకోర్టులో మరో బెంచ్ తాజాగా అంటే 2023 జనవరి 5వ తేదీన అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ..మానవీయం కోణం ఉండాలంటోంది. ఎలా అర్ధం చేసుకోవాలి...
ఉత్తరాఖండ్ హల్ద్వానీ ఘటనపై సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు రెండ్రోజుల క్రితం అంటే జనవరి 5వ తేదీన ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. హల్ద్వానీలోని రైల్వే స్థలంలో దాదాపు 50 వేలమంది అక్రమంగా నిర్మించుకున్న నివాసాల్ని కూల్చేయాలన్న ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. సుప్రీంకోర్టు బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సిట్యువేషన్‌ను ఎలా డీల్ చేస్తున్నామనేదే సమస్యగా మారుతోందని..ఇందులో మానవీయ కోణం ఇమిడి ఉందని, పునరావాసం తప్పకుండా ఉండాలని తెలిపారు. ఈలోగా ఈ అంశంపై స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. అదే సమయంలో ఈ స్థలంలో కొత్తగా ఏ నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేయకూడదని ఆదేశించింది.
50 వేలమందిని రాత్రికి రాత్రి తొలగించడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. రైల్వే స్థలంపై ఏ విధమైన హక్కులేని ప్రజలకు పునరావాసం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటీషన్లపై విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు..రైల్వే, ఉత్తరాఖండ్‌కు నోటీసులు జారీ చేసింది.
2021 జూన్ 8వ తేదీన లక్కర్‌పూర్ ఖోరి అక్రమాలపై సుప్రీంకోర్టు
అయితే ఇదే సుప్రీంకోర్టు 2021 జూన్ 8వ తేదీన మరో కేసులో అక్రమ నిర్మాణాలను కూల్చేయమని తీర్పు ఇచ్చింది. ఆరావళి అటవీ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను 6 వారాల్లోగా క్లియర్ చేస్తూ..అక్రమంగా నిర్మించిన దాదాపు 10 వేల ఇళ్లను కూల్చేయాలని ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆదేశాలిచ్చింది. లక్కర్‌పూర్ ఖోరి గ్రామంలో ఈ అక్రమ నిర్మాణాలున్నాయి.
అక్రమ నివాసితులపై దయచూపించాలని సీనియర్ అడ్వకేట్ కోలిన్ గాన్‌సాల్వేస్ కోరినప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఉదహరించాలి. చాలా సందర్భాల్లో మీరు అడవి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు మాత్రం మానవీయకోణంలో అడవి నాశనం చేయడాన్ని అనుమతించమంటున్నారు. మీకు ఏది ఎప్పుడు అవసరమైతే అప్పుడు రెండు ధోరణులు ప్రదర్శించడం మంచిది కాదని కూడా సుప్రీంకోర్టు బెంచ్ ప్రస్తావించింది.
అక్రమ నిర్మాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు రెండు వేర్వేరు కేసుల్లో వేర్వేరుగా స్పందించడం చర్చకు దారితీస్తోంది. ఒక కేసులో మానవీయం కోణం ఉండకూడదని చెప్పడం, మరో కేసులో ఉండాలని చెప్పడం ఆశ్చర్యం కల్గిస్తోంది.
Also read: Surendran K Pattel: నాడు కేరళలో బీడీ కార్మికుడు.. నేడు అమెరికాలో జడ్జీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook