Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. భార్య భర్తలు, అబార్షన్ విషయంలో న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అరుదైన తీర్పు ఇచ్చింది.భార్యను భర్త బలవంతం చేసినా దానిని అత్యాచారం కిందే పరిగణించాలని స్పష్టం చేసింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం(Medical Termination Of Pregnancy) చట్టం ప్రకారం అబార్షన్ చేయించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడికల్ టర్మినేషన్ కేసులో తీర్పును వెలువరించే సమయంలో మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది.
లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఒంటరి, అవివాహిత మహిళలను మినహాయించాలని సుప్రీం కోర్టు తెలిపింది. వైవాహిక స్థితితో సంబంధం లేకుండా గర్భం దాల్చిన 24 వారాల తర్వాత సురక్షితమైన మరియు చట్టబద్ధమైన అబార్షన్ పొందేందుకు హక్కు ఉందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. భారతదేశంలో అబార్షన్ చట్టం ప్రకారం వివాహితులు, అవివాహిత మహిళలు అనే తేడా లేదని సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఆధునిక కాలంలో చట్టం అనేది వ్యక్తుల హక్కులకు వివాహం ఒక ముందస్తు షరతు అనే భావనను తొలగిస్తోందని తెలిపింది.
Read also: Smita Sabharwal : స్మితా సభర్వాల్ ట్వీట్ పై రచ్చ.. సారీ చెప్పి డిలీట్ చేసిన ఐఏఎస్ Supreme Court Of India Sensational Verdict On abortion
Read also: MLA Raja Singh: రాజాసింగ్ కు రిలీఫ్ దక్కేనా? పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు విచారణపై ఉత్కంఠ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి