Tamil Nadu Assembly Elections 2021: దక్షిణాదిన తమిళనాడు ఎన్నికలు అంటేనే దేశమంతా ప్రత్యేకంగా చూస్తుంది. కానీ నాలుగు దశబ్దాల తరువాత మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఉత్కంఠ నెలకొంది. దానికి తోడు తాను రాజకీయాల్లోకి రావడంలేదని తలైవా సూపర్‌స్టార్ రజినీకాంత్ సైతం తన నిర్ణయాన్ని వెల్లడించిన అనంతరం జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళ రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి.
ఈ క్రమంలో ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేసింది. మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(Tamil Nadu Assembly Elections) 25 స్థానాలను డీఎంకే అధిష్టానం కేటాయించింది. ఈ మేరకు ఆదివారం నాడు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు సమావేశమై చర్చించారు. సీట్ల సర్దుబాటుకు అంగీకారం తెలుపుతూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో నేతలు ఆదివారం ఉదయం సంతకాలు చేశారు. మరోవైపు సీపీఐకి సైతం 6 సీట్లు కేటాయించారు.
Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, Silver Price
We have signed a seat-sharing agreement with DMK. Congress will contest in 25 assembly seats and in the byelection to the Kanyakumari Lok Sabha seat:
Tamil Nadu Congress Chief KS Alagiri, in Chennai pic.twitter.com/Tl526Ak4Oc— ANI (@ANI) March 7, 2021
సీట్ల సర్దుబాటు అనంతరం కాంగ్రెస్ పార్టీ తమిళనాడు(Tamil Nadu) అధ్యక్షుడు కేఎస్ అళగిరి మీడియాతో మాట్లాడారు. డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్‌తో కాంగ్రెస్ పార్టీ నేతల చర్చలు సఫలం అయ్యాయని, సీట్ల సర్దుబాటు సరిగా జరిగిందన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 25 సీట్లు కేటాయించారని తెలిపారు. దాంతోపాటుగా కన్యాకుమారి లోక్‌సభ సీటుకు జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే సీటు కేటాయించారని పేర్కొన్నారు.
Also Read: WhatsApp Privacy Policy అంగీకరించకపోతే వినియోగదారులకు వాట్సాప్ సేవలు బంద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook