Tauktae Effect: పశ్చిమ తీరంలో కొట్టుకుపోయిన నౌక, 273 మందిని కాపాడే ప్రయత్నాలు

Tauktae Effect: తౌక్టే తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అతి తీవ్రతుపానుగా మారిన తౌక్టే ధాటికి పశ్చిమ తీర రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. భారీ గాలులు, కెరటాల ధాటికి ఏకంగా ఓ నౌక కొట్టుకుపోయింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 17, 2021, 10:07 PM IST
Tauktae Effect: పశ్చిమ తీరంలో కొట్టుకుపోయిన నౌక, 273 మందిని కాపాడే ప్రయత్నాలు

Tauktae Effect: తౌక్టే తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అతి తీవ్రతుపానుగా మారిన తౌక్టే ధాటికి పశ్చిమ తీర రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. భారీ గాలులు, కెరటాల ధాటికి ఏకంగా ఓ నౌక కొట్టుకుపోయింది. 

అరేబియా సముద్రంలో(Arabian Sea)ఏర్పడిన తౌక్టే తుపాను (Tauktae Cyclone) విధ్వంసం సృష్టిస్తోంది. తుపాను నుంచి తీవ్ర తుపానుగా..తీవ్ర తుపాను నుంచి అతి తీవ్ర తుపానుగా మారిన తౌక్టే ధాటికి పశ్చిమ తీరప్రాంతాలైన మహారాష్ట్ర, కేరళ, గోవా, గుజరాత్, కేరళ ప్రాంతాలు విల్లవిల్లాడుతున్నాయి. ఇప్పటికే ఆరెంజ్ హెచ్చరిక జారీ అయింది. తీరం వెంబడి భారీ ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(Mumbai Airport) మూసివేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్ బృందాల్ని మొహరించారు. 

అరేబియా సముద్రంలో భారీ ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. బలమైన గాలుల ధాటికి ముంబై పశ్చిమ తీరంలోని పి 305 వాణిజ్య నౌక ( P 305 Ship Adrift) కొట్టుకుపోయింది. నౌకలో ఆ సమయానికి 273 ఉన్నట్టు సమాచారం. సెర్చ్ అండ్ రెస్క్యూ పంపించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కొచ్చి(INS Kochi) గాలింపు చర్యలు చేపట్టింది. 273 మంది ప్రాణాల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే గుజరాత్ తీరాన్ని తాకిన తౌక్టే తుపాను..రాత్రికి పోరుబందర్, మహువా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

Also read: Tauktae Cyclone: పశ్చిమ తీరాన్ని వణికిస్తున్న తౌక్టే తుపాను, ముంబై ఎయిర్‌పోర్ట్ మూసివేత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News