Telangana Floods: తక్షణ సాయంగా 1,350 కోట్లు అందించండి.. ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ (Telangana ) రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాల ( heavy rains ) తో భాగ్యనగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మేరకు సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) కి గురువారం లేఖ రాశారు.

Last Updated : Oct 15, 2020, 06:56 PM IST
Telangana Floods: తక్షణ సాయంగా 1,350 కోట్లు అందించండి.. ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ

Telangana CM KCR writes letter to PM Narendra Modi: హైద‌రాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ (Telangana ) రాష్ట్రం అతలాకుతలమైంది. భారీ వర్షాల ( heavy rains ) తో భాగ్యనగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మేరకు సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) కి గురువారం లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) ప్రకటించారు. కాగా పునరావాసం, సహాయక చర్యల కోసం తక్షణ సాయంగా కేంద్ర ప్రభుత్వం రూ.1,350 కోట్లు అందించాలని కోరుతూ.. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. Also read: Vijayawada Flyover: రేపే కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం

అయితే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల‌పై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకోని పలు సూచనలు చేశారు. అనంతరం వర్షాలతో భారీ నష్టం వాటిల్లిందని పలు వివరాలతో ప్రధానమంత్రికి లేఖ రాశారు. Also read: Heavy Rains: ముంబైలో రెడ్ అలెర్ట్

అయితే రాష్ర్టంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌పై బుధవారం రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్‌కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధ‌వారం సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి గవర్నర్ తమిళసైతో కూడా మాట్లాడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చేపడుతున్న సహాయక చర్యల గురించి తెలుసుకుని.. జాతి మొత్తం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటుంద‌ని వారు హామీ ఇచ్చారు. అయితే కేసీఆర్ లేఖపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది.  

Also read: Hyderabad Rains: 15కు చేరిన మరణాల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News