Mamata Banerjee: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మాత్రమేనని తెలిపారు. బెంగాల్‌లోని 42 స్థానాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. తన రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగా ఎదుర్కొంటానని మమత తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాతే పొత్తులపై తుది నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
రాహుల్ యాత్రపై కూడా మమత స్పందించారు. 'ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ మాకు రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రపై ఎలాంటి సమాచారం లేదు. బెంగాల్ మీదుగా రాహుల్ యాత్ర సాగుతున్నా మాకు సమాచారం ఇవ్వలేదు' అని తెలిపారు. కొన్నాళ్ల నుంచి ఇండియా కూటమిపై బహిరంగ విమర్శలు చేస్తున్న మమత ఇప్పుడు పొత్తు లేదని ప్రకటించడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపింది.
#BigBreaking : #MamataBanerjee confirms no alliance with #Congress in #Bengal. “We will go solo in Bengal. We had proposed seat sharing but they had rejected and there after no further talks have happened. No alliance as gas as Bengal is concerned”. Mamata Banerjee laments “no… pic.twitter.com/x8Cx4iVpqC
— Tamal Saha (@Tamal0401) January 24, 2024
ఈ విబేధాలకు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలే కారణంగా నిలిచాయి. బెంగాల్‌లో మమత సహకారం లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తామని అధిర్ రంజన్ ప్రకటించారు. అవకాశవాది అయిన మమతా బెనర్జీ పార్టీతో కలిసేది లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడి వ్యాఖ్యలతో మమత 'ఒంటరి పోరాటం' అనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధిర్ రంజన్ వ్యాఖ్యలను ప్రస్తావించగా వాటిని పట్టించుకోబోమని మమతా పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడగా ఆ కూటమిలో తీవ్ర విబేధాలు ఉన్నాయి. పైకి బాగానే ఉన్నా లోలోపల లుకలుకలు ఉన్నాయని చాలా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటన ఇండియా కూటమిలో కలకలం రేపింది.
Also Read: Sharmila fire on Jagan: బీజేపీతో అన్నయ్య కుమ్మక్కు.. సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
Also Read: Bharat Ratna: కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న పురస్కారం.. అసలు ఆయన ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook