బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Price Today) వరుసగా ఏడవరోజూ పెరిగాయి. లాక్డౌన్ గడువు పెంపు ప్రకటన వచ్చిన రోజు కూడా బంగారం భారీగానే ర్యాలీ అయింది. నేడు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.110 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,760కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం అంతే పెరగడంతో 10 గ్రాముల ధర రూ.41,960అయింది. లాక్డౌన్ మార్గదర్శకాల పూర్తి జాబితా.. మందుబాబులకు మళ్లీ నిరాశే
నేడు ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరిగాయి. ఢిల్లీలోనూ బంగారం ధర రూ.110 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,910కి ఎగసింది. 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.43,650కి చేరుకుంది. ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు
కాగా, ఓవైపు బంగారం ధరలు ఆల్టైమ్ రికార్డు స్థాయికి చేరుకోగా, వెండి ధరలు ఆరు రోజుల తర్వాత తగ్గాయి. 1కేజీ వెండి రూ.60 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.41,850కి దిగొచ్చింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా అదే ధర వద్ద వెండి ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..