Indian Cough Syrups Banned: ఈ 4 దగ్గు సిరప్‌లు పిల్లలకు తాగిస్తున్నారా ? ఐతే ప్రమాదమే

Indian Cough Syrups Banned: ఇండియాలో తయారైన నాలుగు దగ్గు సిరప్ లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధం విధించింది. వాటిలో ప్రాణాంతకమైన విషపూరిత రసాయానాలు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 

Written by - Pavan | Last Updated : Oct 6, 2022, 07:22 PM IST
Indian Cough Syrups Banned: ఈ 4 దగ్గు సిరప్‌లు పిల్లలకు తాగిస్తున్నారా ? ఐతే ప్రమాదమే

Indian Cough Syrups Banned: భారత్‌లో తయారైన నాలుగు రకాల కాఫ్ సిరప్‌లపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిషేధం విధించడంతో భారత సర్కారు సైతం ఆ నాలుగు దగ్గు సిరప్‌ల తయారీపై విచారణకు ఆదేశించింది. పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియా అనే దేశంలో 66 మంది చిన్నారులు మృతి చెందగా.. వారి మృతికి ఈ నాలుగు రకాల కాఫ్ సిరప్‌ల వినియోగంతో సంబంధం ఉందని తేలింది. ఈ కారణంగానే ముందు జాగ్రత్త చర్యగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు కాఫ్ సిరప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టంచేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సైతం ఈ నాలుగు సిరప్‌ల తయారీపై దర్యాప్తు చేపట్టింది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బ్యాన్ విధించిన నాలుగు దగ్గు సిరప్‌లలో ప్రోమెతజైన్ ఓరల్ సొల్యుషన్, కొఫెక్సామలిన్ బేబీ కాఫ్ సిరప్, మకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ ఉన్నాయి. హర్యానాలోని మెయిడెన్ ఫార్మాసుటికల్స్ లిమిటిడ్ అనే ఫార్మాసుటికల్ కంపెనీ ఈ నాలుగు కాఫ్ సిరప్‌లను తయారు చేస్తోంది. దగ్గు, జలుబు నివారణకు ఈ నాలుగు కాఫ్ సిరప్‌లు ఉపయోగిస్తున్నారు. ఈ నాలుగు కాఫ్ సిరప్‌లలో డైతిలిన్ గ్లైకాల్, ఇతిలిన్ గ్లైకాల్ అనే నిషేధిత రసాయనాలు ఉన్నాయని గుర్తించినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. 

Cough-syrups-Cold-syrups-Diethylene-glycol-Ethylene-Glycol.jpg

DIETHYLENE GLYCOL | డైతిలిన్ గ్లైకాల్ అంటే ఏంటి ? ఎందుకు ఇది డేంజరస్ ?
డైతిలిన్ గ్లైకాల్ లేదా ఇతిలిన్ గ్లైకాల్.. ఈ రెండు కూడా మానవ శరీరానికి ప్రమాదకరమే. వీటిని ఉపయోగించినప్పుడు కిడ్నీ, నరాల పనితీరుపై దుష్ప్రభావం చూపిస్తాయి. తియ్యగా ఉండే ఈ డేంజర్ కెమికల్స్‌కి ఎలాంటి వాసన, రంగు ఉండదు. నీటిలో, ఆల్కాహాల్లో ఇది తేలిగ్గా కలిసిపోతుంది. ఈ కెమికల్స్ కడుపులోకి పోయినప్పుడు పొత్తి కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, తల నొప్పి, మానసిక పరిస్థితిలో మార్పులు, ఇంకొన్నిసార్లు కిడ్నీకి గాయం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

Also Read : Brain Tumor Symptoms: ఈ లక్షణాలు ఉంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చినట్లేనా..?

Also Read : Diabetes And Weight Loss: బొప్పాయి గింజలతో కూడా మధుమేహం, బరువు పెరగడం వంటి సమస్యలకు చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News