Who is Draupadi Murmu : ద్రౌపది ముర్ము .. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తారని బీజేపి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా ఆమె పేరు అటు రాజకీయవర్గాల్లో ఇటు మీడియా వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అది కూడా తలపండిన రాజకీయ కురువృద్ధుడు, పలు పర్యాయాలు కేంద్ర కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, ఇతర కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాపై పోటీకి ద్రౌపది ముర్ము బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ ద్రౌపది ముర్ము ఎవరు అనే సందేహం చాలామందిలో నెలకొంది. ఇంకొంత మంది ఇంటర్నెట్లోకి వెళ్లి 'ఊ ఈజ్ ద్రౌపది ముర్ము' అంటూ సెర్చ్ చేస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే ద్రౌపది ముర్ము రాజకీయ ప్రస్థానంపై ఓ చిన్న లుక్కేద్దాం.
ద్రౌపది ముర్ము 1958లో ఒడిషాలో అభివృద్ధికి నోచుకోని మయుర్‌భంజ్ జిల్లాలో బైదాపోసి అనే ఓ మారుమూల పల్లెటూరిలో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్ వృత్తిలో కొనసాగిన ద్రౌపది ముర్ము.. రాజకీయాల్లోకి వచ్చాకా 1997లో రాయ్‌రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా సేవలు అందించారు.
2000 నుండి 2009 వరకు రాయ్‌రంగాపూర్ నుంచి రెండుసార్లు బీజేపి టికెట్‌పై గెలిచి ఒడిషా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఒడిషాలో 2000 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన అప్పటి బీజేపి - బీజేడి కూటమి నేతృత్వంలోని ప్రభుత్వంలో వాణిజ్యం, రవాణా శాఖ మంత్రిగా ఒకసారి.. మత్సశాఖ, పశుసంవర్థక శాఖ మంత్రిగా మరోసారి పనిచేశారు.
ఒడిషాలో బీజేపి ఎస్టీ మోర్చా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా సేవలు అందించారు.
2015లో జార్ఖండ్‌కి తొలి మహిళా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ము.. తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.
వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు..
మారుమూల పల్లెటూర్లో, నిరుపేద కుటుంబంలో పుట్టిన ద్రౌపది ముర్ము చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు అనుభవించారు.. మరెన్నో చేదు అనుభవాలు చవిచూశారు. చివరకు వ్యక్తిగత జీవితంలోనూ ఆమె భర్త శ్యామ్ చరణ్ ముర్ముతో పాటు ఇద్దరు కుమారులను కూడా దేవుడు ఆమె నుంచి దూరం చేశాడు. అయినప్పటికీ ఏ మాత్రం కృంగిపోకుండా తన ప్రజా సేవ కొనసాగిస్తూ ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే వస్తున్నారు.
Also read : Draupadi Murmu from BJP: ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపి
Also read : President Election: కాంగ్రెస్ కూటమితోనే కేసీఆర్.. కొత్త పార్టీ లేనట్టేనా? తెలంగాణలో ఏం జరగబోతోంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.