Presidential Election: భారత రాష్ట్రపతి ఎన్నికల వేళ కీలక పరిణామం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి పోటీగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు తృణామూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. టీఎంసీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా రాజీనామా చేశారు. గతంలో బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నారు యశ్వంత్ సిన్హా. వాజే పేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ప్రధాని మోడీతో విభేదాలు రావడంతో ఆయన కొంత కాలం క్రితం బీజేపీ నుంచి బయటికి వచ్చారు. గత ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు యశ్వంత్ సిన్హా టీఎంసీలో చేరారు. తాజాగా ఆయన టీఎంసీకి రాజీనామా చేయడం ఆసక్తిగా మారింది.
అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల కూటమి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే మమతా పార్టీకి ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. నిజానికి విపక్షాల కూటమి తరపుప బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని బెంగాల్ సీఎం ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో సమావేశం కూడా జరిపారు. అయితే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. విపక్షాల భేటీలోనే పోటీ చేయాలని శరద్ పవార్ ను నేతలు కోరినా.. ఆయన అంగీకరించలేదు. తర్వాత జమ్మూ కశ్మీర్ ఫరూక్ అబ్దుల్లాతో పాటు గత ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గోపాలకృష్ణ గాంధీ పేర్లను పరిశీలిస్తున్నామని మమతా బెనర్జీ చెప్పారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ ఇద్దరు నేతలు విముఖత వ్యక్తం చేశారు. ఎలాగూ ఓడిపోతాం కాబట్టి పోటీ చేయడం ఎందుకనే ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణలు వెనుకంజ వేశారని తెలుస్తోంది.
I am grateful to Mamataji for the honour and prestige she bestowed on me in the TMC. Now a time has come when for a larger national cause I must step aside from the party to work for greater opposition unity. I am sure she approves of the step.
— Yashwant Sinha (@YashwantSinha) June 21, 2022
శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణలు వెనక్కి తగ్గడంతో విపక్షాల తరపున ఎవరు పోటీ చేస్తారు.. అసలు పోటీ ఉంటుందా లేక రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా అన్న చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లోనూ ప్రెసిడెంట్ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు యశ్వంత్ సిన్హా ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. టీఎంసీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీకి దూరంగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని ట్వీట్ లో సిన్హా చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీఎంసీ పార్టీకి రాజీనామా చేయాలని ఇతర విపక్ష పార్టీలు కోరడం వల్లే యశ్వంత్ సిన్నా.. మమత పార్టీకి రిజైన్ చేశారని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షాలతోశరద్ పవార్ నిర్వహిస్తున్న సమావేశంలో సిన్హా పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.
Read also: Sai Pallavi: విరాటపర్వాన్ని 'విషాదపర్వం'గా మార్చేసిందిగా!
Read also: KTR: కైతలాపూర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేటీఆర్.. కేసు పెట్టుకోవాలంటూ కిషన్ రెడ్డికి సవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.