Anti-Aging Face Pack: ఎంతటి నల్లని చర్మమైనా పెరుగు పేస్ ప్యాక్ తో 2 రోజుల్లో మెరవటం ఖాయం!

Anti-Aging Face Pack: చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ రుగు ఫేస్ ప్యాక్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా చర్మం మృదువుగా, మెరిసేలా తయారవుతుంది. కాబట్టి ప్రతి రోజూ దీనిని వినియోగించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2023, 10:58 AM IST
Anti-Aging Face Pack: ఎంతటి నల్లని చర్మమైనా పెరుగు పేస్ ప్యాక్ తో 2 రోజుల్లో మెరవటం ఖాయం!

Anti-Aging Face Pack: ప్రతి ఒక్కరూ మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. దీని కోసం చాలా మంది ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా ట్రీట్మెంట్లను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో హానికరమైన రసాయనాలు ఉండడం వల్ల వీటిని అతిగా వినియోగిస్తే తీవ్ర చర్మ సమస్యలకు దారి తీయోచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చర్మం మెరవడానికి సమస్యల నివరాణకు తప్పకుండా లాక్టిక్ యాసిడ్ కలిగిన పెరుగును వినియోగించాల్సి ఉంటుంది. పెరుగును ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెరుగు ఫేస్ ప్యాక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగులో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధిక పరిమాణాలు లభిస్తాయి.ముఖంపై ఉండే ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని శుభ్రంగా, ఫెయిర్‌గా చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు మృదువుగా, మెరిసేలా చేయడానికి దోహదపడుతుంది. కాబట్టి దీనిని ఈ ఫేస్‌ ఫ్యాన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు ఫేస్ ప్యాక్ చేయడానికి కావలసిన పదార్థాలు:

  • అరకప్పు పెరుగు
  • రెండు టీస్పూన్ల పసుపు
  • ఒక బౌల్‌

పెరుగు ఫేస్ ప్యాక్ తయారి పద్ధతి:

  • పెరుగు ఫేస్ ప్యాక్ చేయడానికి..ముందుగా ఒక గిన్నె తీసుకోండి.
  • అందులో అరకప్పు పెరుగు, రెండు టీస్పూన్ల పసుపు వేయాలి.
  • ఈ రెండింటినీ బాగా కలపండి.
  • ఇప్పుడు ఈ ఫేస్‌ ఫ్యాక్‌ ముఖానికి అప్లై చేయడానికి సిద్ధంగా ఉంది.

పెరుగు ఫేస్ ప్యాక్‌ను ఎలా వినియోగించాలో తెలుసా?

  • పెరుగు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ముందు మీ ముఖాన్ని కడగాలి.
  • తర్వాత సిద్ధం చేసుకున్న ప్యాక్‌ని రెండు వేళ్లలో తీసుకోండి.
  • తేలికపాటి ఒత్తిడితో చర్మానికి మసాజ్ చేయండి.
  • కళ్ల చుట్టూ అప్లై చేయడం మానుకోవాలని గుర్తుంచుకోండి.
  •  ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Inter Exams 2023: ఇవాళ్టి నుంచే ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షల

Also Read: Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్‌ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News