Black Tea For Weight Loss Diabetes Digestive System: బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీనిని ప్రతి రోజూ ఉదయం పూట టీకి బదులగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఇందులో ఉండే గుణాలు మైండ్‌ను రిఫ్రెష్‌గా కూడా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం చాలా మంది పాలు, చక్కెరతో చేసిన టీలను అతిగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బ్లాక్ టీని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటి వల్ల వచ్చే ఇతర ప్రయోజనాలేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నం.
1. బరువు తగ్గడంలో ఎఫెక్టివ్ ఉంటుంది:
బ్లాక్ టీలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో మెటబాలిజం మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీర బరువు సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. ఈ టీలో ఫ్లేవనాయిడ్లు సులభంగా బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది.
2. డయాబెటిస్:
చాలా మంది మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బ్లాక్ టీ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
3. గుండె సమస్యలకు చెక్:
భారత్‌లో చాలా మంది గుండె పోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు ఈ బ్లాక్ టీలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో ఉండే మూలకాలు గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, కరోనరీ ఆర్టరీ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
4. జీర్ణ క్రియ సమస్యలు:
పాలు, చక్కెరతో కలిపి చేసిన టీ తాగడం మలబద్ధకం, అసిడిటీ సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి బ్లాక్ టీని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే పోషకాలు జీర్ణ క్రియ సమస్యలకు చెక్ పెట్టేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook