Brown Bread For Weight Loss:ఆధుని జీవన శైలి కారణంగా ప్రతి ఒకరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తున్నారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి ప్రపంచమంతా ఆరోగ్య జీవన విధానాలవైపు సాగిపోతోంది. జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం పూట అల్పాహారంగా అనారోగ్యకరమైన ఆహారాలకు బదులుగా.. బ్రౌన్ బ్రెడ్‌ను ఎక్కుగా తీసుకుంటున్నారు. అయితే బ్రెడ్ తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్రౌన్ బ్రెడ్ ప్రయోజనాలు:
బ్రౌన్ బ్రెడ్‌ను గోధుమలతో తయారు చేస్తారు. వీటి తయారి క్రమంలో గోధుమలతో పాటు నీరు, ఉప్పు, చక్కెర, ఈస్ట్‌ను వినియోగిస్తారు. అయితే ప్రస్తుతం చాలా మంది బ్రెడ్ బ్రౌన్ రంగులో కనిపిందుకు ఫుడ్ కలర్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని కొనే ముందు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల శరీరానికి విటమిన్ E, విటమిన్ K, విటమిన్ B, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం,ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి.
బ్రౌన్ బ్రెడ్ శరీరానికి కలిగే ప్రయోజనాలు:
1.గుండె జబ్బుల:
శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు విచ్చలవిడిగా పెరగడం కారణంగా గుండె జబ్బులు వస్తున్నాయి. అయితే ప్రతి రోజూ బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల శరీరానికి హోల్గ్రెన్ లభించి 22 శాతం గుండె జబ్బుల సమస్యల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్త పోటును కూడా నియంత్రిస్తుంది.
2. మెరుగైన జీర్ణవ్యవస్థ:
తరచుగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చల విడిగా తీసుకుని పొట్ట సమస్యలతో పాటు మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్ లభించి.. అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
3. విటమిన్ లోపం:
ప్రస్తుతం చాలా మంది చిన్న వయసుల్లోనే మిటమిన్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ బ్రౌన్ బ్రెడ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్ B, విటమిన్ E, విటమిన్ K లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
4. స్ట్రోక్:
ప్రతి రోజూ బ్రౌన్ బ్రెడ్ తినే వారిలో 14 శాతం దాకా స్ట్రోక్ ప్రమాదాన్నితగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తృణధాన్యాల్లో విటమిన్ k, ఫైబర్ వంటి సమ్మేళనాలను కలిగి ఉంటాయి. దీని వల్ల స్ట్రోక్ సమస్యలు తగ్గుతాయి.
5. బరువు పెరగడం:
ప్రస్తుతం చాలా మంది అధునిక జీవన శైలిని అనుసరిస్తున్నారు. అయితే దీని కారణంగా చాలా మంది శరీర బరువు పెరుగుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బ్రౌన్ బ్రెడ్ ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డైట్లో ఈ బ్రెడ్‌ని తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం
Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి