Chea Seeds Benefits: ఆహార ప్రియులు ఫుడ్ ఆస్వాదించేందుకు వివిధ రకాల రెసిపీలను ట్రై చేస్తూ ఉంటారు. ప్రతిరోజూ కొత్త వంటకాలు తినడానికి ఇష్టపడతాడు. అంతేకాకుండా వీరు ప్రత్యేకంగా వీధుల్లో లభించే చాలా రకాల ఆహారాలను తిసుకోవడం విశేషం. అయితే ఇలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా మంది షుగర్, హైపర్‌టెన్షన్, బిపి, కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ నియమాలు పాటించి ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ విత్తనాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
>>చియా విత్తనాలలో ఫైబర్ స్థాయిలు అధిక పరిమాణంలో ఉంటాయి. నాణ్యమైన ప్రోటీన్లు, అవసరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు విచ్చల విడిగా లభిస్తాయి. అంతేకాకుండా విటిల్లో జింక్ వంటి ఖనిజాలతో కూడిన పవర్ ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియ శక్తి పెంచేందుకు సహాయపడతాయి.
>>చియా విత్తనాలలో ఫినాల్స్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారాలుగా తీసుకుంటే.. రక్తంలో పెరుగుతున్న చక్కెర పెరుగుదలను తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె సమస్యలను కూడా సులభంగా నియంత్రిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా సులభంగా తగ్గిస్తాయి.
>>ఈ గింజలో పాల కంటే ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అంతేకాకుండా పదకొండు రెట్ల భాస్వరం లభిస్తోంది. కాబట్టి వీటిని గుండె, మెదడు, ఎముకల సమస్యలు ఉన్నవారు తీసుకుంటే మంచి లాభాలు పొందడమేకాకుండా బాడీని యాక్టివ్‌గా ఉంటుంది.
>> ఒక టేబుల్ స్పూన్ (15 గ్రాముల) చియా గింజల్లో 5 గ్రాముల కరిగే ఫైబర్ ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.
>> ఈ విత్తనాలలో సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో బాగంగా క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!
Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి