Chia Seeds Perugu Pachadi: చియా సీడ్స్‌తో తయారు చేసిన పెరుగు పచ్చడిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లతో పాటు ఖనిజాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా చియా సీడ్స్‌లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాల ఎక్కువగా లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో పాటు ఈ చియా సీడ్స్‌తో తయారు చేసిన పెరుగు పచ్చడి ప్రతి అల్పాహారంలో తీసుకు తీసుకుంటే బరువు కూడా సులభంగా తగ్గుతారు. మీరు కూడా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభంగా చియా సీడ్స్‌తో పెరుగు పచ్చడిని తయారు చేసుకోండి.
చియా సీడ్స్‌తో పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు పెరుగు
1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్
1/2 టీస్పూన్ అల్లం తురుము
1/2 టీస్పూన్ పచ్చిమిరపకాయల ముక్కలు
1/4 టీస్పూన్ కరివేపాకు
ఉప్పు రుచికి సరిపడా
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
తయారీ విధానం:
ముందుగా ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
అందులో తగినంత పెరుగు వేసుకుని 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత చియా సీడ్స్, అల్లం తురుము, పచ్చిమిరపకాయల ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇవన్ని వేసిన తర్వాత అందులో కొంత నీటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా తయారు చేసుకున్న పచ్చడిని 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి తీసుకుంటే రుచికి రుచి ఆరోగ్యాని ఆరోగ్యం మీ సొంతం.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చిట్కాలు:
పచ్చడిని మరింత రుచిని చేసుకోవడానికి అందులో కొత్తిమీర, పుదీనా, ధనియాలు వంటి తాజా కూరగాయలను వేయవచ్చు.
పచ్చడిని మరింత పుల్లగా ఉంచాలనుకుంటే, నిమ్మరసం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు.
చియా సీడ్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచడం వల్ల అవి మృదువుగా మారతాయి. అంతేకాకుండా పచ్చడిలో బాగా కలుస్తాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి