Frizz To Soft: కొబ్బరినూనె వాడే సరైన పద్ధతి చాలామందికి తెలియదు.. ఇలా వాడితే మీ జుట్టు నేల తాకాల్సిందే..

Coconut Oil For Frizz To Soft Hair: కొబ్బరినూనె మన జుట్టకు బామ్మల కాలంనాటి నుంచి ఉపయోగిస్తున్నాం. ఇది జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. మంచి మాయిశ్చర్‌ కూడా అందిస్తుంది. కొబ్బరి నూనె చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. అయితే, కొబ్బరినూనె వాడే విధానం చాలా మందికి తెలియదు. ఎలా వాడాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Feb 11, 2025, 03:42 PM IST
Frizz To Soft: కొబ్బరినూనె వాడే సరైన పద్ధతి చాలామందికి తెలియదు.. ఇలా వాడితే మీ జుట్టు నేల తాకాల్సిందే..

Coconut Oil For Frizz To Soft Hair: జుట్టుకు కొబ్బరినూనె ఉపయోగించడంలో మందంగా పెరుగుతుంది. కుదుళ్లు పొడిబారే సమస్యను తగ్గించి, మాయిశ్చర్‌ అందిస్తుంది. కొబ్బరినూనె మన స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో భాగం అయితే చర్మానికి మంచి పోషణ అందిస్తుంది. ఇది కాకుండా కొబ్బరినూనె ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది ఇమ్యూనిటీని బలపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొబ్బరినూనె హెయిర్‌, స్కిన్‌ రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం...

చుండ్రుకు చెక్‌..
చుండ్రు సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలంటే కొబ్బరినూనె వాడాలి. గోరువెచ్చని కొబ్బరినూనె జుట్టుకు అప్లై చేయాలి. జుట్టుపై దురదలను కూడా తగ్గిస్తుంది.  ఎందుకంటే కొబ్బరినూనెలో యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కలిగి ఉంటాయి. 

మాయిశ్చర్‌..
కొబ్బరినూనె జుట్టుకు తరచూ అప్లై చేయడం వల్ల మంచి పోషణ అందుతుంది. ఇది కుదుళ్లు పొడిబారకుండా మాయిశ్చర్‌ అందిస్తుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా.. మృదువుగా పెరుగుతుంది.

రిపెయిర్‌..
కొబ్బరినూనె జుట్టుకు ఉపయోగించడం వల్ల డ్యామేజ్‌ అయిన జుట్టును కూడా రిపెయిర్‌ చేస్తుంది. కుదుళ్ల నుంచి జుట్టును బలంగా మారుస్తుంది. అంతేకాదు రెగ్యులర్‌గా కొబ్బరినూనె అప్లై చేయడం వల్ల స్ల్పిట్‌ ఎండ్‌ సమస్య కూడా రాకుండా ఉంటుంది.

జుట్టు పెరుగుతుంది..
కొబ్బరినూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల బాగా పెరుగుతుంది. ఇందులో విటమిన్స్‌, ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. ఇది సెబమ్‌ ఉత్పత్తిని నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ప్రేరేపిస్తుంది.

హెయిర్‌ లాస్‌..
కొబ్బరినూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల సహజసిద్ధంగా మెరుస్తుంది. మీ జుట్టు చూడటానికి గ్లాసీ లుక్‌ పొందుతారు. అంతేకాదు కొబ్బరినూనె రాయడం వల్ల హెయిర్‌ ఫాల్‌ కాకుండా కాపాడుతుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతుంది.

కండీషనర్‌..
కొబ్బరినూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. కొబ్బరినూనెతో జుట్టుకు మసాజ్‌ చేయాలి. కుదుళ్ల సమస్యను నివారిస్తుంది. గోరువెచ్చని కొబ్బరినూనె రాత్రి జుట్టుకు మసాజ్‌ చేసి ఉదయం తలస్నానం చేయాలి. 

ఇదీ చదవండి: ఆధార్‌ కార్డుపై ఎన్నిసార్లు ఇంటి అడ్రస్‌ మార్చుకోవచ్చు? ఆ లిమిట్‌ తెలుసా?  

హెయిర్‌ మాస్క్‌..
కొబ్బరినూనెతో హెయిర్‌ మాస్క్‌గా కూడా వాడొచ్చు. ఇందులో తేనె వేసి జుట్టుకు అప్లై చేయాలి దీంతో జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. హెయిర్‌ కేర్‌ రొటీన్‌లో కొబ్బరినూనె, తేనె కలిపి అప్లై చేసుకోవడం వల్ల సెలూన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. ఇక మ్యాజికల్‌ హెయిర్‌ ఆయిల్‌ ఇంట్లోనే తయారవుతుంది.

ఇదీ చదవండి: జంక్ ఫుడ్ బదులు.. గుప్పెడు సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటే మీ గుండె గట్టిదవుతుంది..

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు కొబ్బరినూనె ఇలా ఉపయోగించండి..
కొబ్బరి నూనె హెయిర్‌ కేర్‌ రొటీన్‌లో చేర్చడం వల్ల మంచి కండీషనర్‌లా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె వేడి చేసి జుట్టుకు అప్లై చేయాలి. కనీసం వారానికి ఓ రెండుసార్లు అయినా జుట్టుకు నూనె అప్లై చేయాలి. చుండ్రు సమస్య రాకుండా నివారిస్తుంది. దీంతో మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News