Fake Smile: నకిలీ నవ్వు వల్ల ఎన్ని నష్టాలో తెలుసా ?

పబ్లిక్ సర్వీస్ ( Public Service ) లో ఉండే వాళ్లు 24 గంటలు ముఖంపై చిరునవ్వు ( Smile ) మెయింటేన్ చేస్తుంటారు. వారి ఉద్యోగంలో అది ఒక ముఖ్యమైన విధి

Last Updated : Aug 18, 2020, 02:24 PM IST
    1. పబ్లిక్ సర్వీస్ లో ఉండే వాళ్లు 24 గంటలు ముఖంపై చిరునవ్వు మెయింటేన్ చేస్తుంటారు. వారి ఉద్యోగంలో అది ఒక ముఖ్యమైన విధి.
    2. కానీ అది వారి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. వారి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది అంటున్నారు
Fake Smile: నకిలీ నవ్వు వల్ల ఎన్ని నష్టాలో తెలుసా ?

 కస్టమర్ చెప్పేది ప్రశాంతంగా వింటూ వారి సమస్యను చిరునవ్వుతో సమాధానం చెబుతుంటారు. కస్టమర్ ఆగ్రహం ( Agression ) వ్యక్తం చేసినా ప్రజాసేవలో ఉండే వారు నిగ్రహం మెయింటేన్ చేస్తారు. నవ్వు మాత్రం వదలరు. నవ్వే పెద్ద సమాధానంగా భావిస్తారు. కానీ అది వారి ఆరోగ్యానికి ( Health ) మంచిది కాదంటున్నారు నిపుణులు. వారి లైఫ్ స్టైల్ ( Lifestyle) పూర్తిగా మారిపోతుంది అంటున్నారు.Prabhas: ఆదిపురుషుడి పాత్ర చేయడం గర్వకారణం

అయితే అలా నవ్వడం కూడా పెద్ద సమస్యకు కారణం అవ్వవచ్చు !!

కొన్ని పరిశోధనల ప్రకారం అలా ముఖానికి నవ్వు అంటుకున్నట్టు నవ్వే నవ్వు వల్ల ఆల్కహాల్ ( Alchohol ) ఎక్కువగా తీసుకునే అవకాశం ఉందట. ఆక్యుపేషనల్ హెల్త్ సైకాలజీ అనే జర్నల్ లో ఈ విషయం వెల్లడించారు. నకిలీ నవ్వు ఎంత ప్రమాదకరమో వివరించారు. ప్రజా సంబంధాల్లో ఉండే వ్యక్తులతో జరిపిన సంభాషణలో పరిశోధకులు పలు విషయాలు తెలుసుకున్నారు.Dhoni : ధోనీతో మంచి దోస్తీ ఉన్న సెలబ్రిటీలు వీరే

ఇలా నకిలీ నవ్వు నవ్వే వాళ్లు తమ వ్యక్తిగత ఫీలింగ్స్ ను మనసులోనే దాచి వేస్తారని.. దీని వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది అన్నారు. ఈ మానసిక ఒత్తిడిని నిలువరించడానికి వాళ్లు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెడతారట. ముఖ్యంగా రెస్టారెంట్స్, రీటెయిల్ స్టోర్లో పని చేసే యువతకు ఈ సమస్య ఉందని చెబుతున్నారు. స్వతహాగా ఓపికలేని వాళ్లు ఇలాంటి విధులు నిర్వహిస్తున్న సమయంలో చిరునవ్వును మెయింటేన్ చేయడానికి చాలా కష్టపడతారట. WFH Tips: ఈ చిట్కాలు పాటిస్తే ఇంటి నుంచి పని చేయడం సరదాగా ఉంటుంది

  

Trending News