Mouthwash Side Effects: ప్రతి రోజూ మౌత్ వాష్‌ను వినియోగిస్తున్నారా.. అయితే ఈ తీవ్ర సమస్యలు తప్పవు..

Dental Mouthwash Side Effects: మౌత్ వాష్ వినియోగించడం వల్ల తీవ్ర అనాకరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి వీటిని వినియోగించకపోవడం చాలా మంచిది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 05:47 PM IST
  • ప్రతి రోజూ మౌత్ వాష్‌ను వినియోగిస్తే
  • నోరు పొడిబారడం, చికాకు సమస్య,
  • నోటి క్యాన్సర్ సమస్యలు వస్తాయి.
Mouthwash Side Effects: ప్రతి రోజూ మౌత్ వాష్‌ను వినియోగిస్తున్నారా.. అయితే ఈ తీవ్ర సమస్యలు తప్పవు..

Dental Mouthwash Side Effects: నోటి సంరక్షణ కోసం చాలా మంది బ్రషింగ్‌తో పాటు మౌత్‌వాష్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇలా మౌత్‌వాష్‌లను వినియోగించడం వల్ల ఎన్నో రకాల దుష్ర్పభావాలు కలుగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో హానికికరమైన రసాయన పదార్ధాలుంటాయి. కాబట్టి వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలన్నాయి. అయితే మౌత్‌వాష్‌ను ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మౌత్ వాష్ దుష్ర్పభావాలు:

నోరు పొడిబారడం:
ప్రతి రోజూ మౌత్‌వాష్‌లని ఉపయోగిస్తే.. నోరు పొడిబారడం అనే సమస్య రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే మౌత్ వాష్‌లో ఆల్కహాల్ పరిమాణాలు అధిక పరిమాణంలో ఉంటుంది. దీని కారణంగా నోరు పొడిబారుతుందని నిపుణులు చెబుతున్నారు.

చికాకు సమస్య:
కొందరికి మౌత్ వాష్ వల్ల నోట్లో నొప్పిలు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మౌత్ వాష్‌ను అతిగా వాడితే నోటిలో మంట సమస్య కూడా రావచ్చు. కాబట్టి వీటిని అతిగా వినియోగించకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  

క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది:
మౌత్‌వాష్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. కాబట్టి వీటిని అతిగా వినియోగించడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో సింథటిక్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది  క్యాన్సర్ ప్రమాదాన్ని తెచ్చి పెట్టే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా వినియోగించకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

దంతాలలో మరక సమస్య:
చాలా మంది మౌత్ వాష్ ఉపయోగించే వారిలో దంతాలలో మరకల సమస్య ఏర్పడుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి సలుభంగా ఉపశమనం పొందడానికి ఈ మౌత్ వాష్ లను వినియోగించకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Kalpika Ganesh Pics: కల్పిక గణేష్ హాట్ ఫొటోస్.. తెలుగమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

Also Read: Actor Ali: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారుడిగా అలీ నియామకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News