Diet Plan For Weight Loss: ఈ సాల్ట్‌తో వేగంగా బరువు తగ్గుతారు, నమ్మట్లైదా? ఇలా ట్రై చేసి చూడండి!

Black Salt Benefits For Weight Loss: బ్లాక్ సాల్ట్‌ను ప్రతి రోజూ ఆహారంలో వినియోగించడం వల్ల సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఈ సాల్ట్‌ను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2023, 04:49 PM IST
Diet Plan For Weight Loss: ఈ సాల్ట్‌తో వేగంగా బరువు తగ్గుతారు, నమ్మట్లైదా? ఇలా ట్రై చేసి చూడండి!

Black Salt Benefits For Weight Loss:  బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే చాలా మందికి దీని వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలియదు. బ్లాక్‌ సాల్ట్‌ ప్రతి రోజూ తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందలో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  సాధారణ ఉప్పుతో పోలిస్తే బ్లాక్ సాల్ట్‌లో సోడియం తక్కువ పరిమాణంలో ఉంటుంది..కాబట్టి దీనిని వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బ్యాక్‌ సాల్ట్‌ వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్ల ఉప్పు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి:
ఆయుర్వేద నిపుణులు ప్రకారం..బ్లాక్ సాల్ట్‌లో ఉండే చాలా రకాల గుణాలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు వాంతులు లేదా మలబద్ధకం వంటి సమస్యలు సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. బ్లాక్ సాల్ట్ ఎసిడిటీ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నల్ల ఉప్పును వినియోగించాల్సి ఉంటుంది.

నల్ల ఉప్పు శరీర బరువు తగ్గిస్తుంది:
నల్ల ఉప్పు బరువును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే దోసకాయ, టొమాటో, ముల్లంగి, క్యారెట్‌లను సలాడ్‌గా చేసుకుని అందులో బ్లాక్‌ సాల్ట్‌ కలుపుకుని తినండి. అంతేకాకుండా ఇందులో జీలకర్రను వినియోగించడం వల్ల కూడా రెట్టింపు ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను, శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది.

నల్ల ఉప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
నల్ల ఉప్పు తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది.
ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
 ఆందోళన హార్మోన్లను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
గుండెల్లో మంట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు తొలగిపోతాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. ఎంపీ సభ్యత్వం రద్దు..?   

Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News