Food for Better Sleep: ఈ కాలంలో నిద్రలేమి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. నిద్ర తక్కువగా ఉండటం వల్ల ఆయుష్షు కూడా తగ్గిపోతుందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. నిద్ర సరిగా లేకపోవడం వల్ల ప్రాణాంతక సమస్యలకు దారితీస్తాయి. దీంతో స్ట్రెస్, మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయి. షుగర్ లెవెల్స్ లో మార్పులు వస్తాయి. అయితే కొన్ని ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది అవేంటో తెలుసుకుందాం.
వెనిగర్..
రాత్రి సమయంలో సరిగా నిద్ర పోనివారు మెలోటినీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు చేర్చుకోవాలని న్యూట్రిషనల్ జనరల్ నివేదిక తెలిపింది. బెల్సామిక్ వెనిగర్ లో మెలోటినిన్ ఉంటుంది ఇది సుఖ నిద్రకు సహాయపడుతుంది. దీంతోపాటు ఎక్స్ట్రా వర్జిన్ ఆలీవ్ ఆయిల్ కూడా ఈ డైట్ లో చేర్చుకోవాలి.
పిస్తా..
పిస్తా సాయంత్రం స్నాక్‌గా తీసుకుంటాం. ఒక గుప్పెడంత పిస్తాలు మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పిస్తా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి న్యూట్రియన్స్ జర్నన్ ప్రకారం పిస్తా తీసుకోవడం వల్ల ఇందులోనే మెలోటినీన్ కంటెంట్ వల్ల నిద్ర బాగా పడుతుంది.
చెర్రీ జ్యూస్..
చెర్రీ జ్యూస్ సూపర్ ఫుడ్. ఇది కూడా సుఖ నిద్రకు సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు చెర్రీలను డైట్లో చేర్చుకోవాలని యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రీషియన్ తెలిపింది ఇందులో ఎక్కువ శాతం మెలోటినీన్ ఉంటుంది ఇది ఆరోగ్యం మంచి నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది.
బాదం..
మీకు పిస్తాలు తినడం ఇష్టం లేకపోతే కంగారు పడకండి మరో ఆరోగ్యకరమైన గింజ ఉంది. అదే బాదంను డైట్ లో చేర్చుకోవడం వల్ల సుఖ నిద్రపోవచ్చు అని మెడికల్ న్యూస్ టుడే తెలిపింది ఎందుకంటే బాదం లో కూడా మెలోడీ అధికంగా ఉంటుంది గుప్పెడు బాదం గింజలను రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
రైస్..
రాత్రి సమయంలో మనం తయారు చేసుకునే డిన్నర్ లో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా పడుతుందని జపనీస్ నివేదిక తెలిపింది. అందుకే రాత్రి సమయంలో కొద్దిగా రైస్ తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందట.
స్ట్రాబెరీస్..
తీపి, పులుపు కలిగిన పండు చేర్చుకోవడం వల్ల కూడా మంచి నిద్ర పడుతోంది. ఇందులో మెలోటినీన్ శాతం అధికంగా ఉంటుంది. న్యూట్రియన్స్ జనరల్ రీసెర్చ్ ప్రకారం స్ట్రాబెరీస్ తింటే కూడా సుఖ నిద్ర కలుగుతుంది.
చమోమిలే టీ..
చమోమిలే టీ వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మాలిక్యులర్ మెడిసిన్ రిపోర్ట్స్ ప్రకారం ఈ టీ తాగడం వల్ల నిద్రలేని సమస్యకు చెక్ పెట్టవచ్చు ఇందులో కూడా మేలోటీనిన్ అధికంగా ఉంటుంది.
ఇదీ చదవండి: పరగడుపున అల్లం రసం తాగితే ఏమవుతుందో తెలుసా?
టమాటా..
న్యూట్రిషన్ జర్నల్ రీసెర్చ్ ప్రకారం టమాటాలు తినడం వల్ల ఇందులో ఉండే మెలోడీనతో నిద్రలేమి సమస్య తగ్గిపోతుంది ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది మీ డైట్ లో టమాటాలు ఉండేలా చూసుకోండి.
చేప..
చేపలు తినడం వల్ల కూడా నిద్ర సమస్యలు తగ్గిపోతాయి. యూనివర్సిటీ ఆఫ్ పెనిసులా ప్రకారం చేపలు వారానికి ఒకసారి పిల్లలకు పెట్టడం వల్ల ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. ఆయిల్ ఫిష్ ఉండేలా చూసుకోండి ఇది నిద్ర కూడా సహాయపడుతుంది.
వాల్నట్స్..
వాల్నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ప్రకారం వాల్ నట్స్ తీసుకోవడం వల్ల మంచి నిద్ర కలుగుతుంది రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇదీ చదవండి: బాదం అతిగా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త కిడ్నీ స్టోన్ తో పాటు బరువు కూడా...
కివి..
మీరు ప్రతిరోజు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ డైట్ లో టీవీ చేసుకోవాలని కొలంబియా యూనివర్సిటీ తెలిపింది. అధ్యయనం ప్రకారం కీవీలో నిద్రకు ఉపక్రమించే గుణాలు ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి