Hair Regrowth 5 Foods: జుట్టు బాగా రాలుతుంది అంటే మీ శరీరంలో ఏవో విటమిన్స్ లేదా ఖనిజాలు తక్కువై ఉండవచ్చు. దీనికి మీ డైట్ ని ఒకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య ఎక్కువై బట్టతల వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీనికి లైఫ్ స్టైల్ అలవాట్లు ఇతర ఆరోగ్య సమస్యలు ఫ్యామిలీ హిస్టరీ కూడా కారణం కావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ అంటే జెనిటికల్ సమస్య వల్ల అలోపేషియా వస్తుంది. దీంతో ఆడ మగ ఇద్దరిలో విపరీతమైన హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతుంది. అంతేకాదు మన లైఫ్ స్టైల్ మార్పులు అతిగా తినడం లేదా కలర్ వేసుకోవడం ఇతర కారణాల వల్ల కూడా ఎయిర్ ఫాల్ సమస్య ఎక్కువ అవుతుంది. కొంతమందిలో వయసు మీద పడుతున్నప్పుడు అలోపేషియా సమస్య వస్తుంది. దీంతో హెయిర్ ఫాల్ సమస్య విపరీతంగా పెరుగుతుంది. ఇది ఆడ మగ ఇద్దరిలోనూ కనిపిస్తుంది.
కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం అయి ఉండవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్, లూపస్ వంటి కారణాలు అయి ఉండవచ్చు. దీనివల్ల విపరీతంగా జుట్టు రాలుతుంది. దీనికి కొన్ని లిథియం బ్లాకర్స్ వంటి మెడికేషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది.. ఇవి కాకుండా కొంతమందికి పిల్లలు పుట్టిన వెంటనే హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతుంది. కొంతమంది బర్త్ కంట్రోల్ పిల్స్ అతిగా వేసుకోవడం కూడా హెయిర్ ఫాల్ సమస్య రావచ్చు. అతిగా స్ట్రెస్ తీసుకోవడం జుట్టు బాగా రాలడానికి ప్రధాన కారణం. దీంతో జుట్టు పిలకలా మారిపోతుంది.
హెయిర్ ఫాల్ సమస్యకు సరైన రెమెడీ మంచి డైట్ ఫాలో అవ్వాలి. దీంతో హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా సమతుల ఆహారం ఐరన్, ప్రోటీన్, జింక్, విటమిన్స్ వంటి మీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ఇవి కాకుండా కొన్ని ఖనిజాలు కూడా మన డైట్ లో ఉండాల్సిందే.. ఐరన్ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది. మన కుదుళ్లకు ఆక్సిజన్ బాగా సరఫరా అయి హెయిర్ ఫాలికల్స్ కాకుండా ఉంటాయి.
ఇదీ చదవండి: తిరుమల భక్తులకు బంపర్ గుడ్‌న్యూస్.. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనం?
ఇంకా విటమిన్ బి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యకరమైన కణాల అభివృద్ధికి శక్తి అందిస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. కొన్ని రకాల హెయిర్ ఫాల్ సమస్యకు గుడ్లు కూడా తీసుకోవాలి.. ఎందుకంటే గుడ్లలో బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది హెయిర్ ఫాలికల్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి కాకుండా ఆకుకూరలు కూడా మన డైట్ లో చేర్చుకోవాలి ఇందులో విటమిన్ సి ఉంటుంది. పాలకూరను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది, కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది..
ఇదీ చదవండి: ఎయిర్‌టెల్ యూజర్లకు పెద్దదెబ్బ.. ఎక్కువ మంది రీఛార్జ్ చేసుకునే ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ డేటా తొలగింపు..
కొన్ని రకాల బెర్రీ పండ్లను డైట్లో చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఫ్రీ రాడికల్ సమస్యలను నివారిస్తాయి. ఇక కొవ్వు చేపలైన సాల్మన్, మేకరాల్ వంటి చేపలను డైట్లో చేర్చుకోవడం వల్ల ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.