Guava Health Benefits: జామపండుతో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Guava Health Benefits: జామ పండు పోషకాల గని. దీనిని పేదవాడి ఆపిల్ అని అంటారు. ఈ పండును తినడం వల్ల మీ శరీరానికి ఎన్నో మినరల్స్ అందుతాయి. చాలా వ్యాధులు దూరమవుతాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2023, 06:41 PM IST
Guava Health Benefits: జామపండుతో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Amazing Health Benefits of Guava: మనకు నిత్యం దొరికే పండ్లలో జామ ఒకటి. చాలా మంది జామ పండును ఎంతో ఇష్టంగా తింటారు. పేదవాడి ఆపిల్ అని జామకాయకు పేరు. జామ మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. జామ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో పైబర్, విటమిన్, ప్రోటీన్స్, ఖనిజాలు మరియు యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి  ఆరోగ్యానికి పోషక విలువలను అందిస్తాయి. జామ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

జామ పండు ఉపయోగాలు
** జామపండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.
** జామ పండులో లైకోపీన్ పుష్కలంగా ఉన్నందున ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. 
** ఈ ఫ్రూట్ లో పైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న కారణంగా ఇది మధుమేహాన్ని అరికడుతుంది. 
** జామ పండులో సోడియం, పోటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్య వంతంగా ఉంచుతుంది. ఇది మలబద్దకాన్ని కూడా దూరం చేస్తుంది. 

Also Read: Benefits Of Sapota: సపోటా పండుతో చెప్పలేనన్ని ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు..

** జామలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటిశుక్లాల సమస్యను తగ్గిస్తుంది. 
** జామ పండు ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ B-9ని కలిగి ఉంటుంది. ఇది గర్బిణీ స్త్రీలకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. 
** జామ ఆకులు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్య మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తుంది. అంతేకాకుండా పంటి నొప్పి, కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. 
** జామ ఫ్రూట్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మీ కండరాల మరియు నరాల నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 
** జామపండ్లలో విటమిన్ B3 మరియు విటమిన్ B6 ఉంటాయి. ఇది మెదడుకు రక్తప్రసరణమను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 
** గువా పండును తినడం వల్ల మీరు బరువు తగ్గుతారు. జలుబు, దగ్గు కూడా రాదు.

Also Read: How to Beat the Heat: వేసవిలో శరీరంలో వేడి తగ్గాలంటే ఏం చేయాలి? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News