Home Remedies For Bloating: ప్రస్తుతం చాలా మంది వీధుల్లో లభించే అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అందులో ముఖ్యంగా చాలా మందిఉబ్బరం సమస్యతో బాధపడడం విశేషం. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ ప్రభావం జీర్ణక్రియపై కూడా పడే అవకాశాలున్నాయి. కావున ఇంతవరకు ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధవహించాలి. ముఖ్యంగా చాలా మందిలో కడుపులో గ్యాస్ ఏర్పడటం వల్ల ఉబ్బరం వంటి సమస్య వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉబ్బరం సమస్యలు ఎలా వస్తాయి..?:
>>శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు శరీరంలో అపానవాయువు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది కొందరికీ కడుపు ఉబ్బరానికి దారి తీయోచ్చు.
>> పొట్టలో గ్యాస్ ఏర్పడం వల్ల.. పొట్టలో తిమ్మిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
>>అయితే కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.
వీటిని ఆహారంగా తీసుకుంటే మంచిదేనా..?:
పచ్చి బఠానీలు:
పచ్చి బఠాణీలలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. అయితే వాటిలో ఆల్ఫా-గెలాక్టోసిడేస్ ఉంటుంది. ఇది కొంతమందిలో ఉబ్బరం, అజీర్ణానికి కారణమవుతుంది. కావున వీటిని తక్కువ పరమాణంలో తీసుకుంటే చాలా మందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని వండుకునే క్రమంలో నీటిలో నానబెట్టుకుని ఆహారాలను వండుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడరని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గోధుమ పిండి:
గోధుమ పిండి తిన్న తర్వాత చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటికి బదులుగా మల్టీగ్రెయిన్ పిండి పిండిని వినియోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమస్యల బారిన పడకుండా జొన్న, బియ్యం పిండిని కూడా వినియోగించవచ్చు.
ఉల్లిపాయ తినడం వల్ల కూ డా ఈ సమస్య వస్తాయి:
ఉల్లిపాయ జీర్ణక్రియకు చాలా మంచిదని విచ్చలవిడిగా తింటూ ఉంటారు. కానీ కొంతమందికి ఉల్లిపాయలు తినడం వల్ల కడుపులో ఉబ్బరం సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఉల్లిని పచ్చిగా తినకుండా నూనెలో వెయించి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం
Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook