Lunar eclipse june 2020: చంద్ర గ్రహణం రాశులపై ప్రభావం చూపిస్తుందా ? చంద్ర గ్రహణం వల్ల జాతకాల్లో ప్రభావం కనిపిస్తుందా ? చంద్ర గ్రహణం రాశీ ఫలాలు ( zodiac sign) పై ప్రభావం చూపిస్తుందా ? గ్రహణాలు మనిషిపై, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని నమ్మేవారిలో చాలామందికి కలిగే సందేహాలివి. అయితే, జూన్ 5న శుక్రవారం అర్ధరాత్రి 11:16 గంటల నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల 32 నిమిషాల వరకు ఏర్పడిన చంద్ర గ్రహణం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని తెలుసుకోవడాని కంటే ముందుగా అసలు చంద్ర గ్రహణాలు ఎన్ని రకాలు ( Types of lunar eclipses) ? అవి ఎలా ఏర్పడతాయో ఓసారి చూద్దాం. అప్పుడే నిన్నటి చంద్ర గ్రహణం తీవ్రత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
చంద్ర గ్రహణం మూడు రకాలు:
చంద్ర గ్రహణం మూడు రకాలుగా ఏర్పడుతుంది. అందులో ఒకటి సంపూర్ణ చంద్ర గ్రహణం ( Total lunar eclipse) కాగా రెండోది పాక్షిక చంద్ర గ్రహణం ( Partial lunar eclipse). ఇక మిగిలింది ఉపఛాయ చంద్ర గ్రహణం ( Penumbral Lunar Eclipse). భూమి నీడ చంద్రునిపై పడకపోయినా.. దాని నీడ మాత్రమే ఉన్నప్పుడు ఉపఛాయ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఇది చంద్రునిపై పొగమంచు నీడలా వ్యాపిస్తుంది. ఛాయ చంద్ర గ్రహణంలో చంద్రునిపై చీకటి ఉండదు. చీకటికి బదులుగా అది కొద్దిగా అస్పష్టంగా మారి చంద్రుడిపై నీడ మాత్రమే పడుతుంది. అందువల్ల ఈ చంద్ర గ్రహణం సంపూర్ణ చంద్ర గ్రహణం, పాక్షిక చంద్ర గ్రహణం మాదిరిగా అంత ప్రభావవంతంగా ఉండదు. సరిగ్గా ఈ కారణం వల్లే ఉప ఛాయ చంద్ర గ్రహణం ఏర్పడే కాలాన్ని జ్యోతిష్య పండితులు దుర్భర సమయంగా పరిగణించడం లేదు. ( Lunar Eclipse 5th June 2020 : చంద్రగ్రహణం.. మూడు గంటలకు పైగా అకాశంలో అద్భుతం )
భూమి నీడను ఛాయ, ప్రచ్ఛాయ అని రెండు రకాలుగా విభజిస్తారు. ఛాయ అనగా సూర్య కాంతి భూమి మీద పడినప్పుడు సూర్య కాంతి పూర్తిగా కనిపించని భాగము. దీనివలన సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ప్రచ్ఛాయ అంటే సూర్యకాంతిలో కొద్ది భాగానికి మాత్రమే భూమి అడ్డుగా రావడం వల్ల ఏర్పడిన చీకటి ప్రాంతం. దీనివలన గ్రహణం పాక్షికంగా ఏర్పడుతుంది. చంద్రుడు కొద్ది భాగం మాత్రమే భూమి ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని పాక్షిక చంద్రగ్రహణం అనీ పూర్తిగా భూమి ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని సంపూర్ణ చంద్రగ్రహణం అనీ పిలుస్తుంటాం. ( Solar eclipse traditions : సూర్య గ్రహణం రోజున వింత ఆచారం )
జూన్ 5, 2020 నాటి చంద్ర గ్రహణం ప్రభావం ఎలా ఉండనుంది ?
సైన్స్ ప్రకారం.. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు.. సూర్యుడి కాంతి చంద్రుడిపైకి చేరదు. అందువల్లే చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అయితే.. జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలలో, పురణాలలో మాత్రం అదే గ్రహణాన్ని ఓ అశుభ పరిణామంగా భావిస్తారు. గ్రహణం సమయంలో ఏదైనా శుభకార్యం చేయడం అపవిత్రమవుతుందనేది చాలామందికి ఉన్న ఓ బలమైన విశ్వాసం. అయితే, జూన్ 5న ఏర్పడిన చంద్ర గ్రహణం మాత్రం అందుకు కొంత భిన్నం. అందుకు కారణం ఇది ఉపఛాయ చంద్ర గ్రహణం కావడమే. ఉప ఛాయ చంద్ర గ్రహణంతో భయపడాల్సిన పనిలేదంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఎందుకంటే.. ఈ గ్రహణంతో ఎలాంటి కీడు జరగదనేది వారి అభిప్రాయం. జ్యోతిష్య శాస్త్రాల గ్రంథాల ప్రకారం… ఉపఛాయ చంద్ర గ్రహణం ( Penumbral Lunar Eclipse) అనేది రాశుల మీద ఎక్కువ ప్రభావం చూపదంటున్నారు జ్యోతిష్య పండితులు. కనుక దీని గురించి ఇక ఆందోళన చెందాల్సిన అవసరమే లేదనేది వారి అభిప్రాయం. ( జనవరి 10 నాటి చంద్ర గ్రహణం విశేషాలు )
ఈ గ్రహణం యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాలలో చాలా వరకు కనిపించింది. జూన్లో వచ్చే పౌర్ణమిని వసంత కాలంలో చివరి పౌర్ణమిగా భావించిన ఉత్తర అమెరికాలోని ఆల్గోన్క్విన్ జాతి తెగలు దీనినే స్ట్రాబెరీ మూన్ ( strawberry moon eclipse 2020 ) అనే పేరుతో పిలుచుకుంటున్నట్టు నాసా వెల్లడించింది. అలాగే దీనినే హిందువుల సంప్రదాయం ప్రకారం జ్యేష్ట మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని హిందువులు జ్యేష్ట పూర్ణిమ ( Jyeshtha purnima ) అని లేక వట పూర్ణిమ ( vat purnima ) అని పిలుస్తారు.
గ్రహణంతో అనుగ్రహమా ?
గ్రహణ సమయంలో మంత్ర జపం , దైవారాధన చేస్తే మంచి శుభఫలితాలు కలుగుతాయని... మంత్రసిధ్ధికి ఇది మంచి సమయమని చాలా మంది భావిస్తుంటారు. గ్రహణం పట్టినంతసేపు దైవాన్నే తల్చుకుంటూ దైవ చింతనలోనే గడిపితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయనేది వారి నమ్మకం. జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నా.. ఆ భగవంతుని అనుగ్రహం ఉంటే అంతా మంచి జరుగుతుందనేది ఇంకొందరి నమ్మకం. గ్రహణం తరువాత దాన ధర్మాలు చేయడం, గోసేవ చేయడం వలన దోషం పోయి మంచి జరుగుతుందనే వారూ లేకపోలేదు.
గ్రహణం సమయంలో పూర్తిగా భగవంతుని ధ్యానంలో ఉండాలని... ఆ సమయంలో అన్న పానీయాలు తీసుకోకుండా ఉపవాసం చేయాలని.. ఆహార పదార్దాలపై దర్భలు, తులసి వేసి ఉంచడం వల్ల వాటిపై గ్రహణం ప్రభావం పడకుండా పవిత్రత చేకూరుతుందని ఇంకొందరు ఆధ్యాత్మకవేత్తలు చెబుతున్న మాట. గ్రహణం వీడిన తరువాత పుణ్యస్నానాలు ఆచరించి ఎవరికి కలిగినంతలో వారు లేనివారికి దానధర్మాలు చేస్తే అంతా మంచే జరుగుతుందనేది ఇంకొందరి విశ్వాసం. ( Solar Eclipse affects on Ranji Trophy matches : సూర్య గ్రహణం ఎఫెక్ట్.. ఆలస్యంగా ప్రారంభమైన క్రికెట్ మ్యాచ్లు )
గ్రహణం ఏదైనా.. ఆ నారాయణుడిని శరణు వేడితే అనుగ్రహం తప్పక లభిస్తుందంటున్నారు నారాయణుడినే సదా సర్వంగా భావించే నారాయణ భక్తులు.
ఆ నారాయణుడినే సర్వాంతర్యామిగా భావించే వారి కోసం..
నమామి నారాయణ పాద పంకజం
కరోమి నారాయణ పూజనం సదా
వదామి నారాయణ నామ నిర్మలం
స్మరామి నారాయణ తత్వమవ్యయం..
అను నిత్యం భగవంతుని పాదాలను సేవిస్తూ.. నిరంతరం నారాయణుని ఆరాధిస్తూ.., ఎల్లప్పుడూ ఆ నారాయణుని నామాన్నే ఉచ్చరిస్తూ.. నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ దిక్కు లేరని భగవంతుని శరణు వేడితే ఆయనే మనలను రక్షిస్తాడు.
నాస్తికుల మాట ఏంటి ?
భక్తుల నమ్మకాలు ఎలా ఉన్నా... గ్రహణం అనేది కేవలం ఒక ఖగోళ శాస్త్ర పరిణామం అని.. ఆకాశంలో సంభవించే గ్రహాణానికి, భూమ్మీద జీవులపై అనుగ్రహానికి అసలు సంబంధమే లేదనేది నాస్తికుల అభిప్రాయం.
ఏదేమైనా.. దేవుడు, మనిషి, ప్రకృతి మూడు వేర్వేరే అయినా... ఒకదానిలో ఒకటి మిలితమై అంతటా వ్యాపించి ఉంటాయి కనుక మూడూ సత్యములేననే విశిష్టాద్వైతం అనే వేదాంతాన్ని నమ్మే వారికి ఇది కచ్చితంగా భిన్నంగానే కనిపిస్తుందని ఆస్తికులు చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live link here..